Share News

పినపళ్ల పంచాయతీకి ఉత్తమ అవార్డు

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:53 AM

పేదరికం నిర్మూలన, జీవనోపాధి విభాగాల్లో బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పినపళ్ల పంచాయతీకి ఉత్తమ అవార్డు లభించింది. ఈ అవార్డును పినపళ్ల సర్పంచ్‌ సంగీత సుభాష్‌, కార్యదర్శి ఎస్‌.వీర్రాజు గురువారం అమరావతిలో జరిగిన పంచాయతీరాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణకుమార్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మైలవరపు కృష్ణతేజ చేతుల మీదుగా అందుకున్నారు.

పినపళ్ల పంచాయతీకి ఉత్తమ అవార్డు
అమరావతిలో అవార్డును స్వీకరిస్తున్న సర్పంచ్‌ సుభాష్‌

  • పేదరికం నిర్మూలన, జీవనోపాధి విభాగాల్లో పురస్కారం ప్రదానం

  • అమరావతిలో సర్పంచ్‌ సుభాష్‌, కార్యదర్శి వీర్రాజు స్వీకరణ

ఆలమూరు, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పేదరికం నిర్మూలన, జీవనోపాధి విభాగాల్లో బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పినపళ్ల పంచాయతీకి ఉత్తమ అవార్డు లభించింది. ఈ అవార్డును పినపళ్ల సర్పంచ్‌ సంగీత సుభాష్‌, కార్యదర్శి ఎస్‌.వీర్రాజు గురువారం అమరావతిలో జరిగిన పంచాయతీరాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణకుమార్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మైలవరపు కృష్ణతేజ చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో వివి ధ కేటగిరిలకు సంబంధించి పలు పంచాయతీలకు అవార్డులను అందించారు. పేదరిక నిర్మూలన, జీవనోపాధి విభాగంలో పినపళ్ల పంచాయతీ చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 2021లో ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి సుభాష్‌ సర్పంచ్‌గా గెలుపొందారు. అప్పటి నుంచి పినపళ్ల గ్రామాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల వ్యయంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సుభాష్‌ సర్పంచ్‌గా తనదైన శైలిలో ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుం టూ ఎప్పటికప్పుడు గ్రామాభివృద్ధిపై చర్చిస్తూ నిధులను రాబట్టడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. గ్రామంలోని జరుగుతున్న అభివృద్ధి పనుల తీరును పరిశీలించడానికి అనేక బృందాలు సర్వేలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రామపరిధిలో ఉన్న ఓఎన్జీసీ, పలు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా ఆ విభాగంలో పినపళ్లను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు స్వీకరించి సర్పంచ్‌ సుభాష్‌, కార్యదర్శి వీర్రాజులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్‌, ఎంపీడీవో ఎ.రాజు తదితర అధికారులు అభినందించారు.

Updated Date - Apr 25 , 2025 | 12:53 AM