Share News

మేమూ ఆడేస్తాం..

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:59 PM

అమలాపురం టౌన్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కళ్లు లేవని కలత చెందలేదు. కాళ్లు లేవని వెనుకడుగు వేయలేదు. దివ్యాంగులు ఎందులోను తక్కువ కాదని నిరూపిస్తూ ముందడగు వేశారు. డిసెంబరు 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావ ంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా క్రీడా ప్రాధికా

మేమూ ఆడేస్తాం..
చెస్‌ ఆడుతున్న దివ్యాంగులు

అమలాపురంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు

అమలాపురం టౌన్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కళ్లు లేవని కలత చెందలేదు. కాళ్లు లేవని వెనుకడుగు వేయలేదు. దివ్యాంగులు ఎందులోను తక్కువ కాదని నిరూపిస్తూ ముందడగు వేశారు. డిసెంబరు 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావ ంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియ ంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అభివృద్ధి అధికారి రుద్ర వైకుంఠరావు పర్యవేక్షణలో దివ్యాంగులకు పలు క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించగా ఉత్సాహంగా పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ ఏవై శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ యు.రాజు సహకారంతో పోటీలను నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులు సకాలంగులకు ధీటుగా క్రీడల్లో రాణించి సత్తా చాటాలని వైకుంఠరావు సూచించారు. విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం పెంచేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ క్రీడా పోటీలను ముఖ్య అతిథులు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 300మందికి పైగా దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌ పోటీలు 3 విభాగాల్లో నిర్వహించారు. చెస్‌, క్యారమ్స్‌, వాలీబాల్‌ పోటీలు జరిగాయి. విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి నిమ్మకాయల సురేష్‌, డెఫ్‌ అండ్‌ డెమ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌, సమాఖ్య అధ్యక్షుడు కొసన సత్యసుబ్రహ్మణ్యం, జిల్లా సభ్యులు జె.పరంకుశం, నల్లా నాయుడు ఉన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 11:59 PM