3211 దివ్యాంగ పింఛన్లు రద్దు
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:46 AM
దివ్యాంగులు పథకాలు కట్ అవుతు న్నాయి. సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫి కేషన్‌తో అర్హులు.. అనర్హుల లెక్క తీస్తు న్నారు.
18 వేల మందికి రీవెరిఫికేషన్
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
దివ్యాంగులు పథకాలు కట్ అవుతు న్నాయి. సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫి కేషన్‌తో అర్హులు.. అనర్హుల లెక్క తీస్తు న్నారు.గతంలో అనర్హులు దివ్యాంగ ఫిం చన్లు పొందుతున్నారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వ సదరం రీ అసెస్ మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో సుమారు 32 వేల మంది దివ్యాంగులు ఉన్నారు. అందులో ఇప్పటి వరకూ 18 వేల మందిని సదరం రీ అసెస్‌మెంట్ చేసింది.వీరిలో 3211 మం ది అనర్హులని తేలడంతో పింఛన్లు రద్దు అయ్యాయి.ఇంకా 14 వేల మంది వర కూ రీఅసెస్‌మెంట్ చేయవలసి ఉంది. గత ప్రభుత్వం ఇష్టానుసారం అన ర్హులకు పింఛన్లు ఇవ్వడంతో ఈరోజు ఇబ్బంది ఏర్పడింది. కూటమి ప్రభుత్వ ం అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్ ఇచ్చే దిశగా నడుస్తోంది. ప్రస్తుతం అనర్హులైన వారి బస్సు పాస్‌లు రద్దవుతాయి.దీంతో చాలా మంది బస్సు పాస్ లు కోల్పో యారు. గతంలో ఎలా ఇచ్చారో కానీ..మార్చి నెల నుంచి చాలా మంది దివ్యాంగులకు బస్సు పాస్‌లు ఇవ్వడం లేదు. కడియం మండలానికి చెందిన ఓ దివ్యాంగుడికి 75శాతం పైగా అంధత్వ సమస్య ఉంది. అతని గతంలో ప్రభుత్వ ఫింఛన్‌తో పాటు రాయితీతో కూడిన బస్సు పాస్ ఇచ్చారు. గత మార్చి నెల నుంచి పాస్ ఇవ్వడంలేదు. ఎందుకంటే నిబంధనలు మారాయని.. 100 శాతం అంధత్వం ఉంటేనే బాధితుడికి ఉచిత ప్రయాణంతో పాటు అతని సహాయ కుడికి 50 శాతం రాయితీ ఇస్తూ పాస్ జారీ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.