జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో 157 అర్జీలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:52 AM
రాజమహేంద్రవరం రూరల్, ఆగస్టు 11(ఆంధ్ర జ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంకోసం ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తోందని, అర్జీలను నిర్ణీత గడు
రాజమహేంద్రవరం రూరల్, ఆగస్టు 11(ఆంధ్ర జ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంకోసం ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తోందని, అర్జీలను నిర్ణీత గడువులో నాణ్యతతో పరిష్క రించాల్సిన బాధ్యత అధికారులదేనని జిల్లా కలె క్టర్ ప్రశాంతి తెలిపారు. సోమవారం నిర్వహిం చిన జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో 157 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను ఓర్పుతో విని మర్యాద పూర్వకంగా స్పందించాలన్నారు. పరిష్కరించగల అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరి ష్కరించాలని, పరిష్కరించలేని వాటికి కారణాలు వివరించి అర్జీదారులకు తెలియజేయాలన్నారు. మండలాల వారీగా రోజువారీగా ఫిర్యాదుల తీరు ను సమీక్షించాలన్నారు. గ్రీవెన్స్ ఎక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీపై ఎండార్స్‌మెంట్ తప్పనిసరిగా ఇవ్వాల ని సూచించారు. సోమవారం నిర్వహించిన ఆర్జీల లో రెవెన్యూకి సంబంధించి 71, పంచాయతీరాజ్ కి సంబంధించి 43, విద్యుత్‌శాఖకు సంబంధించి 7, విద్యారంగానికి చెందినవి 5, పోలీస్, పుర పాలక శాఖలకు చెందినవి 31 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, డీఆర్వో సీతారామమూర్తి, సీపీవో అప్ప లకొండ, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నా రు. దీనిలో భాగంగా కోరుకొండ మండలం కాప వరం గ్రామ పంచాయతీ గణేష్ నగర్ కాలనీవా సులు సుమారు 60 మంది బైసాస్ రోడ్డు నిర్మా ణం వెంటనే చేపట్టాలని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.