సమస్యల పరిష్కారానికే పీజీఆర్‌ఎస్
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:04 AM
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జేసీ చిన్న రాముడు అన్నారు.గోకవరం తహశీల్దార్ కార్యా లయంలో సోమవారం జరిగిన ప్రజా సమ స్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్ర మానికి హాజరై అర్జీలు స్వీకరించారు.
గోకవరం, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జేసీ చిన్న రాముడు అన్నారు.గోకవరం తహశీల్దార్ కార్యా లయంలో సోమవారం జరిగిన ప్రజా సమ స్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్ర మానికి హాజరై అర్జీలు స్వీకరించారు. 69 అర్జీ లను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. వీటిలో 35 అర్జీలు సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కార్మికులు నుంచి అందాయని తెలిపారు. కంటి చూపు పూర్తిగా లేదు. మరొక మనిషి సహాయం చేస్తేనే ముం దుకు అడుగు పడేది. ఆలనా పాలనా చూసే వాళ్లు కరువయ్యారు. ప్రభుత్వ పింఛనుకు అన్ని అర్హతలున్నా ఆ భాగ్యం కలగడంలేదని గుమ్మళ్ల దొడ్డి గ్రామానికి చెందిన ఇంజరపు రాంబాబు వాపోయాడు. సుమారు 60 ఏళ్ల పైనుంచి ఎకరం 40 సెంట్లు బండి దారిని సాగు చేసుకుంటున్నా. ఇపుడు ఆ భూమిని వేరేవారికి అప్పగించేందుకు ప్రయత్నాలు జరు గుతున్నాయి సార్ నాకు కాళ్లు అసలు పని చేయవు. ఎవరైనా ఎత్తుకొని తీసికెళ్తేనే నా వ్యవహరాలు చక్కబెట్టుకోగలను అని తంటి కొండ గ్రామానికి చెందిన ముమ్మిడిశెట్టి రమేష్ అనే దివ్యాంగుడు జేసీ వద్ద తమ గోడు విలపించుకున్నాడు. కాళ్ళు చేతులు చచ్చుబడి పూర్తి దివ్యాంగుడైన తనకు ప్రభుత్వం నుంచి రూ.6 వేలు మాత్రమే అందుతున్నాయి.. దయచేసి రూ.15 వేల పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని అచ్చుతాపురం గ్రామా నికి చెందిన కోలా శివాజీ వేడుకున్నాడు. తన భార్యను ప్రసవం నిమిత్తం గోకవరం ప్రభు త్వాసుపత్రికి తీసుకెళ్తే అక్కడి వైద్యులు చేసిన ఆపరేషన్ వికటించి సుమారు ఏడాదిగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతుందని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు జేసీ వద్ద లబోదిబోమన్నాడు. సుమారు 19 నెలలు నుం చి జీతాలందక కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని సత్యసాయి తాగునీటి సరఫరా కార్మికులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. గోకవరంలో ప్రజలను భయబ్రాంతలకు గురి చేస్తున్న కోతులు, కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని జడ్పీటీసీ మాజీ సభ్యుడు పాలూరి బోస్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా సర్వే అధికారి బి.లక్ష్మీనారా యణ, డీఎంహెచ్‌వో కె.వెంకటేశ్వరరావు, డీసీ హెచ్‌ఎస్ పద్మ, ఎంపీడీవో గోవింద్, ఇన్‌చార్జ్ తహశీల్దార్ పి.సాగర్ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌కు 191 అర్జీలు
రాజమహేంద్రవరం రూరల్ జూలై 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 191 అర్జీలు వచ్చాయని డీఆర్‌వో టి.సీతారామమూర్తి తెలిపారు.ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 1గంట వరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్‌ఆర్.ప్రేమ్ కుమార్, ముఖ్యప్రణాళిక అధికారి ఎల్.అప్పలకొండ, డీఆర్‌డీఏ పీడీ మూర్తిలతో కలిసి అర్జీలు స్వీకరించారు.