పి.గన్నవరం పశువైద్యశాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - May 22 , 2025 | 01:01 AM
ఏరియా ఆసుపత్రికి మీరు ఇద్దరేనా.... ఉద్యోగులు మిగతా వారు ఎక్కడా.. మీ ఏడీఏ లేరా.. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రిని కనీసం మీరైనా శుభ్రపర్చండి.. ఇక్కడ పశువులకు ఏవిధంగా సేవలు అందిస్తు న్నారు.. ఇలా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం ఏరియా పశువైద్యశాలను సంద ర్శించి అక్కడున్న ఇద్దరు ఉద్యోగులను ప్రశ్నిం చారు.
పి.గన్నవరం, మే 21(ఆంధ్రజ్యోతి): ఏరియా ఆసుపత్రికి మీరు ఇద్దరేనా.... ఉద్యోగులు మిగతా వారు ఎక్కడా.. మీ ఏడీఏ లేరా.. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రిని కనీసం మీరైనా శుభ్రపర్చండి.. ఇక్కడ పశువులకు ఏవిధంగా సేవలు అందిస్తు న్నారు.. ఇలా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం ఏరియా పశువైద్యశాలను సంద ర్శించి అక్కడున్న ఇద్దరు ఉద్యోగులను ప్రశ్నిం చారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 20న ప్రచురిత మైన శిథిలావస్థలో పి.గన్నవరం ఏరియా పశు వైద్యశాల కథనానికి ఎమ్మెల్యే గిడ్డి స్పందించి ఆసుపత్రిని సందర్శించారు. ఏడీఏ డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారని, ప్రస్తుతం అమలాపురం ఏడీఏ విజయారెడ్డి ఇన్‌చార్జ్‌గా వ్యహరిస్తున్నారని సి బ్బంది చెప్పారు. దీంతో విజయారెడ్డితో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు ఆసుపత్రి ఇంత అధ్వానంగా ఉందని నాదృష్టికి ఎందుకు తీసుకురాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆసు పత్రికి సంబంధించిన వివరాలతో క్యాంపు కార్యా లయానికి రావాలని ఏడీఏకు సూచించారు. ఆసుపత్రిని పూర్తిగా తొలగించి కొత్త భవనాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారుచేసి సంబం ధిత శాఖకు పంపిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసి సిబ్బం ది నియామకానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈప్రాంతంతో డ్రైనేజీ సౌకర్యం లేదని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధాన రహదారి చెంతనే రూ.70లక్షలతో డ్రైనేజీ నిర్మాణం జరగనుందని, చిన్న డ్రైనేజీలన్ని ప్రధాన డ్రైన్‌కు అనుసంధానం చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు తాటికాయల శ్రీనివాసరావు, షేక్ దొరబాబు, టి.నాగరాజు ఉన్నారు.