కూర్చుని తాగండి!
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:37 AM
ప్రభుత్వం మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సయిజ్ చట్టంలోని సెక్షన్ 24 (ఏ)ను అదనంగా చేర్చారు.
ఉమ్మడి జిల్లాలో 455 దుకాణాలు
రూ.5 లక్షలు, రూ.7.50 లక్షల ఫీజు
రూ.30 కోట్ల వరకూ ఆదాయం
ప్రభుత్వ జీవో విడుదల
మందుబాబుల ఆనందం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సయిజ్ చట్టంలోని సెక్షన్ 24 (ఏ)ను అదనంగా చేర్చారు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే పలు రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటు మద్యం షాపులకు అనుమతిచ్చింది. జగన్ జమానాలో పిచ్చి బ్రాండ్లకు అడ్డుకట్ట వేసింది. దాదాపు 200 రకాల నాణ్యమైన బ్రాండ్లను అందుబా టులోకి తెచ్చింది. జగన్ జమానాలో రాష్ట్రాన్ని వదిలి పారిపోయిన కంపెనీలు మళ్లీ తిరిగొచ్చాయి.అయితే.. ఆ మేరకు ఆదాయం సమకూరకపోవడంతో పాటు మ ద్యం తాగే విషయంలో మందుబాబులు ఇబ్బందులు పడుతుండడం.. బహిరంగ మద్యం పానంపై విమర్శలు రావడం వంటి అంశాలపై ప్రభుత్వం నివేదికలు రప్పిం చుకొని విశ్లేషణ చేసింది.పర్మిట్ రూమ్‌లు లేకపోవడమే ఇబ్బం దేనిని స్పష్టమైంది.దీంతో పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
తాగడానికి తిప్పలు తప్పాయ్..
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి వచ్చినా.. ధరలు తగ్గినా.. చుక్కేసుకోడానికి చోటుకు మందు బాబులు తిప్పలు పడేవాళ్లు. కిళ్లీ బడ్డీల దగ్గర, చాటుమాటు ప్రదేశాల్లో తాగడం జరిగేది. పోలీసులు, ఎక్సైజ్ వాళ్ల కంటబడితే జరిమానా, కేసు లేదా ‘ఎంతో కొంత’ వదిలేది. ప్రైవేటు మద్యం షాపులు వచ్చినా తాగడానికి పెద్ద తతంగమే ఉండేది. ఇప్పుడు పర్మిట్‌రూమ్‌లు ఇవ్వడంతో ఆ ఇబ్బం దులు తప్పనున్నాయి. బార్‌లలో అదనపు ధరలు వసూలు చేస్తుండడం, పరిశుభ్రత పట్టించుకోకపోవడం వంటి కారణాలతో మద్యం షాపుల్లోనే చుక్కేసుకో వడానికి మందుబాబులు మొగ్గు చూపుతున్నారు. అయితే పర్మిట్ రూమ్‌లు లేక ఇబ్బందిగా ఉండేది. వైసీపీ ప్రభుత్వంలో బార్‌లకు లైసెన్సు ఫీజును రెం డేళ్లకు జమ చేసుకొంది. వాళ్లకు ఈ ఏడాది ఆగస్టు వరకూ సమయం ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చినా రాబడిలో కూడా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినా కొత్త బార్ పాలసీలో మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నారు. అంటే ఆ మండలానికి కేటా యించిన షాపులు మండల పరిధిలో ఎక్కడైనా పెట్టుకో వచ్చు.మండల కేంద్రాల్లో జన సంచారం ఎక్కువగా ఉంటుందని అక్కడే షాపులు పెట్టారు.కాస్త పెద్ద గ్రా మాల్లో సైతం మద్యం దుకాణం అందుబాటులోకి రాలే దు.ఇది కూడా రాబడిపై ప్రతికూల ప్రభావం చూపిం ది. ఇప్పుడు పర్మిట్ రూంలు ఇవ్వడంతో ఆ సమ స్యలు తీరనున్నాయి.పెద్ద గ్రామాల్లో మినీ మద్యం షా పులు ఏర్పాటు చేయాలని మందుబాబులు కోరుతున్నారు.
అనుమతి ఇలా ఇస్తారు..
మద్యం షాపుల పక్కన మద్యం తాగడానికి రూమ్ లను అనుమతిస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం. 273ను జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న మద్యం షాపులకు(ఏ4) పర్మిట్ రూమ్‌ను మంజూరు చేస్తా రు. ఏడాదికి రూ.55 లక్షల్లోపు మద్యం షాపునకు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ చెల్లించే వాళ్లకు రూ.5 లక్షలు, ఆపై రూ.85 లక్షల వరకూ రూ.7.50 లక్షల వార్షిక లైసెన్సు రుసుం కింద నిర్ణయించారు. 2019కి ముందు టీడీపీ హయాంలో ఉన్న ఫీజునే ఇప్పుడూ పెట్టారు. ఈ రుసుం చెల్లించిన వారికి అనుమతి మంజూరు చేస్తారు. పర్మిట్ రూంలో వంట చేయడా నికి వీల్లేదు.షాపు సమయం ప్రకారమే పర్మిట్ రూం తెరిచి ఉంచాలి. భద్రత, పరిశుభ్రత చర్యలూ తీసుకో వాలి. ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి పూర్తి ఆదేశాలు రావాలని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.
మొత్తం 455 షాపులు
తూర్పు గోదావరిలో 138, కాకినాడ జిల్లాలో 171, కోనసీమ జిల్లాలో 146 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నా యి. మొత్తంగా 452 మద్యం షాపులు 43 బార్లు ఉన్నాయి.ప్రభుత్వం బార్లకు మినహా అన్ని షాపులకూ పర్మిట్ రూంల అనుమతిస్తుంది. పర్మిట్ రూంల ద్వారా ఏడాదికి ప్రభుత్వ ఖజానాకు రూ.30 కోట్ల వరకూ జమ కానుంది. అలాగే మద్యం రాబడి పెరిగే అవకాశం ఉంది.