కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - May 02 , 2025 | 01:37 AM
కూటమి ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.
అమలాపురం టౌన్/రూరల్, మే 1(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. గురువారం మేడేను పురస్కరించుకుని సీపీఐ, ఏఐటీయూసీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో అమలాపురంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొప్పుల సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా పలుచోట్ల మేడు పతాకాలను కార్మిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆనందరావు ఆవిష్కరించారు. ఆటో కార్మికులకు కార్యాలయం కోసం స్థలం మంజూరు చేయడంతోపాటు రూ.10లక్షలు భవన నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో ఆంధ్రా ఆటోవాలా జిల్లా ప్రధాన కార్యదర్శి ఊటాల వెంకటేష్, డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి గౌరీశంకర్‌తో కలిసి పలుచోట్ల మేడే పతాకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పసుపులేటి సుబ్బారావు, పితాని వెంకటరమణ, ఎన్.శ్రీనివాస్, మోకా శ్రీనివాసరావు, వి.శ్రీనివాస్, కురచ నాగేశ్వరరావు, బొక్కా నాని తదితరులు పాల్గొన్నారు. పేరూరు వైజంక్షన్ వద్ద నిర్వహించిన మేడే వేడుకల్లో పలు తీర్మానాలు ఆమోదించారు. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ చిత్రాన్ని ముద్రించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని తీర్మానించారు. వాసంశెట్టి శ్రీనివాసరావు, బొమ్మి ఫణీంద్ర పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యాలయంతో పాటు వన్నెచింతలపూడి, తాండవపల్లి, బండారులంక తదితర గ్రామాల్లో అరుణ పతాకాలను జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. నాయకులు బీమాల శ్రీను, పి.శివ, పి.అమూల్య, దైవకృప, పార్వతీ, వరలక్ష్మి, రాజు, నాగలక్ష్మి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. కేకేసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంటెద్దు వెంకన్నాయుడు, ఏలేశ్వరపు రాధాకృష్ణ, మొల్లేటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. టీఎన్‌టీయూసీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కుసుమ సూర్యమోహనరావు ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే ఆనందరావుతో పాటు నాయకులు వలవల శివరావు, పట్నాల రమణ, భాస్కర్ల రామకృష్ణ, గుమ్మళ్ల చిన్నా, తొమండ్రు గోపి, కొప్పుల బాబి, కూటమి నాయకులు పెచ్చెట్టి విజయలక్ష్మి, బొర్రా ఈశ్వరరావు, బొంతు బాలరాజు పాల్గొన్నారు. పేరూరు వైజంక్షన్‌లో టీఎస్‌ఎన్ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో కార్మికులకు ఖాకీ చొక్కాలను పంపిణీ చేశారు. దొంగ శ్రీను, డేగల చిన్నా, తాళ్ల సాంబమూర్తి, రొక్కాల నాగేశ్వరరావు, నాతి శ్రీనివాసరావు పాల్గొన్నారు.