Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - May 02 , 2025 | 01:39 AM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. గురువారం విలస గ్రామంలో పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అయినవిల్లి, మే 1(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. గురువారం విలస గ్రామంలో పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల ఎంత నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దాల సుబ్బారావు, టీడీపీ పి.గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి నామన రాంబాబు, క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సయ్యపురాజు సత్యనారాయణరాజు, డీసీ కాకర శ్రీనివాస్‌, మట్టపర్తి వెంకటరమణ, అక్కిశెట్టి దుర్గారావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 01:39 AM