Share News

తారాస్థాయికి పెద్దింట్లమ్మ ఆలయ వివాదం

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:42 AM

అంతర్వేది, జూలై 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం మెండుపాలెం (చిన్నకొల్లేరు) గ్రామంలో శ్రీపెద్దింట్లమ్మ ఆలయం వివాదం తారాస్థాయికి చేరింది. అమ్మవారి ధూపదీప నైవేద్యాలు, ఉత్సవాలు గ్రామస్తులతో నిర్వహించబడేవి. ఇటీవల గ్రామస్తులు 2 వ

తారాస్థాయికి పెద్దింట్లమ్మ ఆలయ వివాదం
వెంకటపతిరాజాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలీసుల అదుపులో ఎన్నారై

అంతర్వేది, జూలై 19 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం మెండుపాలెం (చిన్నకొల్లేరు) గ్రామంలో శ్రీపెద్దింట్లమ్మ ఆలయం వివాదం తారాస్థాయికి చేరింది. అమ్మవారి ధూపదీప నైవేద్యాలు, ఉత్సవాలు గ్రామస్తులతో నిర్వహించబడేవి. ఇటీవల గ్రామస్తులు 2 వర్గాలుగా మారడంతో ఉత్సవాలు వివాదానికి దారి తీశాయి. వెంటనే ఆర్డీవో, డీఎస్పీ, స్థానిక ఎస్‌ఐ సమక్షంలో వారికి సర్ధిచెప్పినా వినిపించుకోలేదు. ఆలయాన్ని 7 నెలల క్రితం దేవదాయశాఖకు అప్పగించి వార్షికంగా వచ్చే జాతర మహోత్సవాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎండోమెంట్‌ ఆర్డరును రద్దు చేసి మళ్లీ సింగిల్‌ కమిటీని నియమించి ఒక వర్గం వారికి అప్పగించారు. రెండో వర్గంవారు వచ్చి పోలీసులను అడగ్గా ఆర్డరు కాపీ ఉన్నదని చెప్పి వారు చూపించకపోవడంతో ఇరు వర్గీయుల మధ్య వివాదం జరిగేలా ఉందని 50మంది పోలీసు సిబ్బందితో వారికి శనివారం ఉదయం సర్ధి చెప్పారు. ఆలయ ఆవరణలో చండీహోమం, శాంతిహోమం, అన్నదానం నిర్వహించేందుకు, ఆలయాన్ని శుద్ధి పరిచేందుకు ఒక వర్గానికి చెందినవారు రావడంతో పోలీసులు ఆలయం వద్ద మోహరించారు. ఆదివారం నిర్వహించే కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో శని వారం మధ్యాహ్నం పోలీసుస్టేషన్‌లో ఎన్నారై యెనుముల వెంకటపతిరాజాతో కలిసి ఒక వర్గం వర్గీయులు పోలీసుస్టేషన్‌ ముందు బైఠాయించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వెంకటపతిరాజా, వర్గీయులు, పోలీసులకు తోపులాట జరిగింది. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌, సీఐ నరేష్‌ ఘటనా స్థలానికి చేరుకుని వెంకటపతిరాజా, 21 మంది యువకులు, మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు వాహనాల్లో వేరే ప్రదేశాలకు తరలించారు.

Updated Date - Jul 20 , 2025 | 12:42 AM