పెళ్లి పనులకు ఊరెళ్తే ఇల్లు గుల్ల
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:26 AM
పెద్దాపురం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కూతురికి పెళ్లి కుదరడంతో పనుల నిమిత్తం ఊరు వెళ్తే ఇంట్లోకి దొంగ చొరబడి నగదు, బం గారం దోచుకెళ్లాడు. ఈనెల 10న కాకినాడ జిల్లా పెద్దాపురం టెలికం కాలనీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను గురువారం పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరి రాజు విలేకర్లకు వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్నట్టు చెప్పా రు. వివరాల ప్రకారం.. పెద్దాపురం టెలికం కాలనీకి చెందిన పెంకే సింహాచలం ఆర్బీ
పెద్దాపురంలో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు
పెద్దాపురం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కూతురికి పెళ్లి కుదరడంతో పనుల నిమిత్తం ఊరు వెళ్తే ఇంట్లోకి దొంగ చొరబడి నగదు, బం గారం దోచుకెళ్లాడు. ఈనెల 10న కాకినాడ జిల్లా పెద్దాపురం టెలికం కాలనీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను గురువారం పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరి రాజు విలేకర్లకు వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్నట్టు చెప్పా రు. వివరాల ప్రకారం.. పెద్దాపురం టెలికం కాలనీకి చెందిన పెంకే సింహాచలం ఆర్బీ పట్నం ప్రభు త్వ పాఠశాలలో స్కూల్ అ సిస్టె ంట్‌గా పనిచేస్తున్నాడు. అత డి కుమారైకు వివాహం కుదరడంతో రూ.5 లక్షల నగదు, అరకాసు బంగారం బెడ్‌రూమ్ బీరువా లాకర్‌లో భద్రపరిచాడు. పెళ్లి పనుల నిమిత్తం కుటుంబ సభ్యులంతా కాకినాడ వెళ్లారు. దీంతో అనూరు గ్రామానికి చెందిన యర్రంశెట్టి చరణ్ విఘ్నేష్ ఇంటి తలుపులు బ ద్దలు కొట్టి లాకర్‌ను తెరిచి రూ.5 లక్షల నగదు, అరకాసు బంగారు వస్తువును దోచుకెళ్లాడు. రాత్రి 12 దాటిన తర్వాత ఇంటికి చేరుకున్న య జమాని ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. బెడ్‌రూమ్‌లోని బీరువాలో నగదు, బం గారు వస్తువు మాయం కావడం గుర్తించి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ వి.మౌనిక కేసు నమోదు చేయడంతో సీఐ విజయ శంకర్ దర్యాప్తు చేశారు. బుధవారం రాత్రి పెద్దాపురం నుంచి సామర్లకోట వెళ్లే రహదారిలో అయోధ్యాలయం గ్రాండ్ లేఅవుట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని సీఐ విజ యశంకర్ అరెస్టు చేశారు. నిందితుడి దగ్గర నుంచి బంగారం, రూ.3.60 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, హోండా యాక్టీవా మోటారు సైకిల్, దొంగతనానికి ఉపయోగించే ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడిపై గతంలో చైతన్యపురం, మలక్‌పేట, అంబర్ పేట, సరూర్ నగర్, రాజమండ్రి వనస్ధలిపురం, గండేపల్లి, ప్రకాష్‌నగర్, సర్పవరం, హయాత్ నగరం పోలీస్ స్టేషన్‌లలో పలు దొంగతనం కేసులు నమోదైనట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.