Share News

పిఠాపురం ఆడపడుచులకు పవన్‌ కానుక

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:49 PM

పిఠాపురం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్‌ శ్రావణ మాస కానుక పంపారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనే మహిళలకు అందించేందుకు పదివేల చీరలు, పసుపు

పిఠాపురం ఆడపడుచులకు పవన్‌ కానుక
ప్యాంకింగ్‌ చేసిన చీరలు, పసుపు, కుంకుమ

రేపు పాదగయలో పదివేల చీరలు, పసుపు, కుంకుమ అందజేత

పిఠాపురం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్‌ శ్రావణ మాస కానుక పంపారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనే మహిళలకు అందించేందుకు పదివేల చీరలు, పసుపు, కుంకుమ సమకూర్చారు. చీరలు, పసుపు, కుం కుమ బుధవారం పిఠాపురం చేరుకోగా జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీరమహిళలు ప్యాకింగ్‌ చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. క్షేత్రంలో శుక్రవారం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకూ 5 బ్యాచ్‌లుగా వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి బ్యాచ్‌ లో వేయి మంది నుంచి 1500మంది వరకూ వ్రతాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వ్రతాల్లో పాల్గొన్న వారితో పాటు అక్కడకు వచ్చేవారికి చీరలు అందిస్తారు. వ్రతాల టిక్కెట్లు గురువారం నుంచి జారీ చేస్తామని జనసేన వర్గాలు వెల్లడించాయి. వరలక్ష్మి వ్రతాల క్యూలైన్లు, బారీకేడ్లును కాకినాడ ఏఎస్పీ మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌ పరిశీలించారు.

Updated Date - Aug 20 , 2025 | 11:49 PM