20న పెరవలిలో పవన్ పర్యటన
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:19 AM
పెరవలి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 20న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పర్యటన సందర్భంగా పెరవలిలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కొవ్వూరు ఆర్డీవో రాణీసుస్మిత మంగళవారం సాయంత్రం పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పవన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా విజ్జేశ్వరం నుంచి పైపు లైన్‌ల ద్వారా
డిప్యూటీ సీఎం బహిరంగ సభ
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి దుర్గేష్, కొవ్వూరు ఆర్డీవో
పెరవలి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 20న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పర్యటన సందర్భంగా పెరవలిలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కొవ్వూరు ఆర్డీవో రాణీసుస్మిత మంగళవారం సాయంత్రం పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పవన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా విజ్జేశ్వరం నుంచి పైపు లైన్‌ల ద్వారా నిడదవోలు నియోకజవర్గంతోపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 854 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తారు. సుమారు రూ.1400 కోట్లు ఖర్చు అయ్యే ఈ భారీ ప్రాజెక్టును పవన్ ద్వారా శంకుస్థాపన చేయాలని మంత్రి దుర్గేష్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో వివిధ ప్రాంతాల్లో భూగర్భ వాటర్‌స్టోరేజీ ట్యాంక్‌లను నిర్మిస్తారు. అక్కడే వోవర్ హ్యాడ్‌ట్యాంక్‌లను నిర్మించి చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందిస్తారు. పెరవలి మండలంలో కానూరు, పెరవలిలో ట్యాంక్‌లు నిర్మిస్తారని చెప్తున్నారు. అందువల్ల పెరవలిలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వచ్చే అవకాశం ఉన్న ందున బహిరంగ స్థలం కూడా విశాలంగా ఉండాలన్న ఉద్దేశంతో తొలుత నిర్ణయించిన చోట కాకుండా జాతీయ రహదారిపై రామకృష్ణ రైస్‌మిల్లు ఎదురుగా సుమారు 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా పవన్ వచ్చే హెలి క్యాప్టర్ దిగేందుకు తణుకు ఉమెన్స్ కళాశాల, లేదా సభా ప్రాంగణం వద్ద ఏది అనుకూలంగా ఉంటే అక్కడ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నా రు. ఈనెల 20న లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చే యాలని అధికారులు, నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగానే మంగళ వారం మధ్యాహ్నం కొవ్వూరు ఆర్డీవో ఈ స్థలాన్ని పరిశీలించి వెళ్లగా మళ్లీ సాయంత్రం ఆమెతో కలి సి మంత్రి దుర్గేష్ కూడా ఆయా శాఖల అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిరంజన్, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, జనసేన నాయకులు పిప్పర రవి, ప్రత్తిపాటి ప్రసాద్ కుమార్, నందిప శ్రీనివాస చక్రవర్తి పాల్గొన్నారు.
స్థలాల పరిశీలన
నిడదవోలు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనెల 20న నిడదవోలు నియోజకవర్గం పెరవలి రానున్న నేపథ్యంలో ఆయన ప్రయాణించే హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యేందుకు నిడదవోలు పట్టణంలో హోలి క్రాస్ హాస్పిటల్ పక్కన ఉన్న స్థలం, పాటి మీద పట్టిక ఫ్యాక్టరీ స్థలాలను కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, నిడదవోలు సీఐ పీజీవీ తిలక్ తదితరులు పరిశీలించారు.