Share News

నేడు కోనసీమకు డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:10 AM

అమలాపురం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని కేశనపల్లి, శివకోడులో జరపనున్న పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత నడుమ పవన్‌ పర్యటనను విజయవంతం చే

నేడు కోనసీమకు డిప్యూటీ సీఎం
శివకోడులో పవన్‌ పాల్గొనే బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లు

పవన్‌కల్యాణ్‌ పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు

కేశనపల్లిలో డ్రెయిన్‌ కారణంగా దెబ్బతిన్న కొబ్బరితోటల పరిశీలన

అమలాపురం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని కేశనపల్లి, శివకోడులో జరపనున్న పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత నడుమ పవన్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు అటు అధికారులు, పోలీసులతో పాటు జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో తల మునకలై ఉన్నాయి. శివకోడులోని 2.0 కార్యక్రమాల ప్రారంభంతో పాటు బహిరంగ సభకు కాపు కల్యాణ మండపం ఎదురుగా ఉన్న లేఅవుట్‌లో ఏర్పాటు చేస్తున్నారు. సభలో సుమారు 10వేల మంది ప్రజలు పాల్గొనే విధంగా సన్నాహాలు చేశారు. పవన్‌ రాక కోసం గూడపల్లి, శివకోడులో ప్రత్యేక హెలిప్యాడ్లను కూడా ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. పవన్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ మంగళవారం సాయంత్రం అధికారులతో సమీక్షించారు. అలాగే జిల్లా ఎస్పీ భధ్రతా పరమైన చర్యలను ప్రకటించారు. డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాల్లో జనసైనికులు భారీగా ఫ్లెక్సులు, జెండాలు ఏర్పాటు చేసి స్వాగత ద్వారాలు సిద్ధం చేశారు. ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాట్లతో పాటు పవన్‌ పర్యటనకు సంబంధించి అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. పవన్‌ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఎటువంటి అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యేక పాస్‌లు ఇచ్చినవారికి మాత్రమే ఆయా ప్రాంతాల్లోకి అనుమతించే రీతిన ఏర్పాట్లు చేశారు. కాగా కేశనపల్లి డ్రెయిన్‌ వల్ల కొబ్బరిచెట్లకు జరిగిన నష్టం అంచనాలను పవన్‌కల్యాణ్‌ కేశనపల్లి వంతెన నుంచి వీక్షించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడి శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటారని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

పవన్‌ పర్యటన సాగేదిలా..

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ బుధవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ బేగంపేట నుంచి విమానంలో బయలుదేరతారు. 9.45కు రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.10 గంటలకు మలికిపురం మండలం గూడపల్లిలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరకుంటారు. 10.15 గంటలకు కేశనపల్లి వ్యూ పాయింట్‌కు చేరకుని శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తారు. స్థానికంగా 20 మంది బాధిత కొబ్బరి రైతులతో ముఖాముఖిగా తోటలు దెబ్బతినడానికి గల కారణాలపై చర్చిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కేశనపల్లి నుంచి శివకోడుకు 11.20 గంటలకు చేరుకుంటారు. శివకోడులో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. రాష్ట్రస్థాయి పల్లెపండుగ 2.0 పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం శివకోడులో సభాస్థలికి కూతవేటు దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్‌ వెళతారు.

Updated Date - Nov 26 , 2025 | 12:10 AM