Share News

జన గోదారి!

ABN , Publish Date - Dec 21 , 2025 | 01:19 AM

పెరవలి.. జన గోదారిగా మారింది.. పవన్‌ అభిమానులు.. నాయకులతో నిండి పోయింది.. అంచనాకు మించి తరలివచ్చారు.

జన గోదారి!
పెరవలిలో పవన్‌కు జ్ఞాపిక అందజేస్తున్న నాయకులు

వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

రెండేళ్లలో పూర్తిచేస్తామని హామీ

ఐదు జిల్లాలకు గోదావరి జలాలు

జనసంద్రమైన పెరవలి

2 గంటల పాటు పర్యటన

700 మందితో బందోబస్తు

పెరవలి/రాజమహేంద్రవరం/నిడదవోలు, డిసెం బరు 20 (ఆంధ్రజ్యోతి) : పెరవలి.. జన గోదారిగా మారింది.. పవన్‌ అభిమానులు.. నాయకులతో నిండి పోయింది.. అంచనాకు మించి తరలివచ్చారు. ఉద యం నుంచే సభా ప్రాంగణం కిక్కిరిసింది. సుమారు 10 వేల మందికి సరిపడా సభా ప్రాంగణాన్ని తాత్కా లికంగా నిర్మించారు. అయితే 20 వేలకుపైగా జనం రావడంతో సభా ప్రాంగణంతో పాటు బయట కూడా జన సందోహం కనిపించింది. సభా ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రదేశంలో పోలీసులు చెకింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. జనం అధికంగా తరలి రావడంతో సభా ప్రాంగణంలోకి వదిలితే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో సభా ప్రాంగణం బయ ట నిలువరించడంతో వేలాది మంది అక్కడే ఉండి పోయారు.11.20 గంటల ప్రాంతంలో హెలీకాఫ్టర్‌ శబ్దం వినిపించడంతో ఒక్కసారిగా విజిల్స్‌, కేరింతలు, కేకలతో అలజడి మొదలైంది. పవన్‌ కల్యాణ్‌ ప్రసం గం ఆరంభమైన తర్వాత కాస్త వెసులుబాటు కల్పించ డంతో సమస్య నెమ్మదించింది. అమరజీవి జలధార ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేసి ప్రజల దాహార్తిని తీరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. పెరవలిలో శనివారం ఆయన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.7910 కోట్లు ఖర్చుపెడుతున్నాం. ఈ ప్రా జెక్టు ద్వారా 30 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించామన్నారు. ఉభయగోదావరి జిల్లాల తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకార సోద రులకు మేలు చేయాలనే ఉద్దేశంలో ఎక్కువ తీర ప్రాంతాలతో కలిపి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశామ న్నారు.ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందిం చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2018లో భీమవరం ప్రాంతంలో నాయకర్‌తో తిరు గుతున్నపుడు తాగడానికి నీళ్లు ఇస్తే పసుపు పచ్చగా ఉన్నాయి. అవి ఒడగట్టుకుని తాగాలట. నాకు తల తిరిగిపోయింది. ఏమయ్యాయంటే ఆక్వా కారణంగా భూగర్భజలాలు కలుషితమయ్యాయని తెలిసింది.. అప్పుడే అనుకున్నా గోదావరి జిల్లాలకు స్వచ్ఛమైన నీరందించాలని.. ఇన్నాళ్లకు నా కల ఫలించిందన్నారు. రాజోలు శివాలయానికి నిధులిస్తామని చెప్పారు. సభా ప్రాంగణంలో స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశంలో స్ర్కీన్లను ఏర్పాటు చేయక పోవడంతో మహిళలు అసహనం వ్యక్తం చేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీ ప్యా డ్‌ని ఏర్పాటు చేయడంతో పవన్‌ వెళ్లే సమయంలో ఇబ్బంది కలగలేదు. సుమారు 700 మందితో పోలీ సులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ నరసింహ కిశోర్‌ స్వయంగా బందోబస్తు పర్యవేక్షించారు.

అమరజీవి జలధార ప్రాజెక్టు అద్భుత ఘట్టం

అమరజీవి జలధార వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు శంకుస్థాపన ఒక అద్భుత ఘట్టం.. ఇది ఉభయ గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల కల.. ధవళేశ్వరం వద్ద గోదావరి జలాలు శుద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికి తాగునీ రందిస్తారు. తూర్పు, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూ రు, కోనసీమ జిల్లాల్లోని 23 నియోజక వర్గాలు, 66 మండలాల్లోని 67.82 లక్షల మంది ప్రజలకు దాహార్తి తీరనుంది. ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే అమ రజీవి జలధార ప్రాజెక్టు త్యాగం నుంచి సంక్షేమానికి సాగే శాశ్వత ప్రవాహం. ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు పేరు ప్రాజెక్టుకు పెట్టడం హర్షణీయం.ఆయన స్ఫూర్తి ప్రతి ఇంట్లో నీటిగా ప్రవ హించాలన్నది పవన్‌కల్యాణ్‌ ఆలోచనకు నిదర్శనం.గత ప్రభుత్వం ఈ ప్రాజె క్టును పక్కనపెడితే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మళ్లీ పట్టాలెక్కిం చారు.రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు సురక్షిత మంచినీరందిస్తోంది.

- కందుల దుర్గేష్‌, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి

గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు..

ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమరజీవి జలధార ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుంది. గత ఐదేళ్లగా దేశ వ్యాప్తంగా జలజీవన్‌ పను లు జరుగుతున్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఈ పనులు చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా పట్టించుకోలేదు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ చొరవతో ఈ పనులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.

- భూపతిరాజు శ్రీనివాస వర్మ, కేంద్ర పరిశ్రమల శాఖా సహాయ మంత్రి

కాటన్‌లానే.. పవన్‌ను గుర్తుంచుకుంటారు..

ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన తాగునీటి సమస్య పై దృష్టి సారించి దీనిని ప్రారంభించడం ఎంతో శుభపరిణామం. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టడం హర్షనీయం. తన నియోజకవర్గమైన ఉండికి కూడా గోదావరి జలాలు అందు తున్నందుకు సంతోషంగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ పేరును ఏ విధంగా గుర్తించుకున్నారో పవన్‌ కల్యాణ్‌ పేరును అదే విధంగా గుర్తుంచుకుంటారన్నారు.

- రఘురామకృష్ణంరాజు, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌

పర్యటన సాగిందిలా..

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శనివారం ఉదయం 11.15 గంటలకు హెలీకాఫ్టర్‌ ద్వారా సభా వేదిక వద్ద ఉన్న హెలీప్యాడ్‌లో దిగారు.

11.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్న పవన్‌కు అధికారులు అమరజీవి జలఽధార వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ మ్యాప్‌ను వివరించారు. 11.45గంటలకు ప్రాజెక్ట్‌ శిలాఫలకాలను ఆవిష్కరించారు 11.47 గంటలకు సభా వేదికపైకి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశా రు.. 12.25 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి 1.10గంటలకు ప్రసంగాన్ని ముగించారు. 1.25 గంటలకు హెలికాప్టర్లో మంగళగిరి బయలుదేరి వెళ్లారు.

పవన్‌ ఎటెళ్లారు..

పెరవలిలో పవన్‌ కల్యాణ్‌ సమావేశం ముగిసిన అనంతరం ఆయన హెలీకాఫ్టర్‌ పైకి లేచింది. అయితే అది విజయవాడ వైపు వెళ్లకుండా ఇటు పెరవలి మండలంలోని గ్రామాల వైపుగా వచ్చింది. ఆయన గోదావరిని చూశారా.. లేదంటే విజ్జేశ్వరం బ్యారేజీని చూశారా.. అనే దానిపై చర్చింకుంటున్నారు.

నేతల క్యూ

పవన్‌ కళ్యాణ్‌ సభకు నాయకులు క్యూకట్టారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు కందుల దర్గేశ్‌, పార్థసారఽథి, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, సోము వీర్రాజు, హరిప్రసాద్‌, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, అయితాబత్తుల ఆనందరావు, గిడ్డి సత్యనారాయణ, ఆరుమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్‌, పులవర్తి అంజిబాబు, ధర్మరాజు, బొమ్మిడి నాయకర్‌, చింతమనేని ప్రభాకర్‌, వరుపుల సత్యప్రభ, బండారు సత్యానందం, చిర్రి బాలరాజు, పంతం నానాజీ, పితాని సత్యనారాయణ, నిడదవోలు టీడీపీ ఇన్‌చార్జి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 01:19 AM