నేడు పవన్ రాక
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:30 AM
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అమరజీవి జలధార ప్రాజెక్టుకు శంకుస్థాపన
పెరవలి/నిడదవోలు, డిసెంబరు 19 (ఆం ధ్రజ్యోతి): జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు రూ.3,050 కోట్ల అమరజీవి జలధార ప్రాజె క్టుకు శంకుస్థాపన చేస్తారు. సుమారు 10 వేల మంది హాజరవుతారని అంచనా. మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు సభా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ధవళేశ్వరం, విజ్జేశ్వరం వద్ద గోదావరి జలాలు శుద్ధిచేసి తూర్పు, పశ్చి మ గోదావరి, కాకినాడ, ఏలూరు, డా.బీ.ఆర్. అం బేడ్కర్ కోనసీమ ఐదు జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లోని 67.82 లక్షల మంది ప్రజలకు గోదావరి జలాలు అం దుతాయన్నారు. అధికారులు గత మూడు రోజులుగా ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లలో తల మునకలయ్యారు. పెరవలి - తణుకు జాతీయ రహదారి మధ్యన వేదిక కావడంతో వాహనాలు రాకపోకలకు పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.12 వేల మందికి సరిపడా స్నాక్స్ ప్యా కెట్లు సిద్ధం చేస్తున్నారు. గోస్తనీ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6 వేల మందికి, స్థానిక నాయ కులు, కాంట్రాక్టర్లు 4 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
బందోబస్తుకు 700 మంది
బందోబస్తుకు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ పర్యవేక్షణలో ఆరుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, ఎస్‌ఐలు, కాని స్టేబుళ్లు, హోంగార్డులు, రోప్‌పార్టీలు, స్పెషల్ పార్టీలు కలిపి మొత్తం 700 మందిని వినియోగిస్తున్నామని ఎస్పీ నరసింహ కిశోర్ తెలి పారు. సభా స్థలికి వచ్చే వారికి రెండు ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లకు వేర్వేరుగా పార్కింగ్‌లు కేటాయించారు. సభా వేదికకు కొంత దూరం నుంచి హైవేపై ఎడమ వైపున లేన్(వరుస)లో మాత్రమే వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కుడివైపున సభకు వచ్చే వాహనాలు మినహా మిగతా వాటిని అనుమతించరు. హెలీప్యాడ్ దగ్గరలోని పార్కింగ్ వరకూ ఎల్-1 లిస్టులో ఉన్న 25 మందిని మాత్రమే అనుమతిస్తారు.
పర్యటన ఇలా...
ఉదయం 9.20 గంటలకు మంగళగిరిలో బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు 10.10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 10.50 గంటలకు పెరవలి చేరుకుంటారు. 10.55 గంటకు హెలీపాడ్ నుంచి సభాస్థలికి వస్తా రు. 11 గంటలకు అమరజీవి జలధార కార్య క్రమంలో పాల్గొంటారు.2 గంటల పాటు అక్కడే ఉండి 1 గంటకు వేదిక నుంచి హెలీ ప్యాడ్ వద్దకు వెళతారు. 1.10 గంటలకు హెలీపాడ్ నుంచి బయలు దేరి 1.50 గం టలకు గన్నవరం ఎయిర్ పోర్టులో దిగు తారు. మధ్యాహ్నం 2 గంటలకు మంగళ గిరి క్యాంప్ ఆఫీసుకు చేరుకుంటారు.