Share News

ప్రజానంద..పవనాలు!

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:56 AM

పవన్‌ కల్యాణ్‌ నాడు హామీ ఇచ్చారు.. అది నేడు నెర వేర్చారు. కేఎస్‌ఈజెడ్‌ (కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి) పరిధిలోని భూములను తిరిగి రైతు లకు ఇప్పించేలా బాధ్యత తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

ప్రజానంద..పవనాలు!
ఉప్పాడలో గురువారం జరిగిన సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (ఫైల్‌ఫొటో)

సెజ్‌ రైతులకు న్యాయం

2,180 ఎకరాలు ఇచ్చేలా జీవో

రిజస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు

1551 మంది రైతుల ఆనందం

బోట్లకు రూ.72 లక్షల పరిహారం

కొత్తపల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పవన్‌ కల్యాణ్‌ నాడు హామీ ఇచ్చారు.. అది నేడు నెర వేర్చారు. కేఎస్‌ఈజెడ్‌ (కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి) పరిధిలోని భూములను తిరిగి రైతు లకు ఇప్పించేలా బాధ్యత తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ఆ హామీని డిప్యూటీ సీఎం హోదాలో నిలబెట్టుకున్నారు. కాకినాడ సెజ్‌కు ఇచ్చిన భూ ముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చి మేలు చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సెజ్‌లో అవార్డు భూము లను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఈ రిజిస్ట్రేషన్‌కు రుసుములు, స్టాంపు డ్యూటీలు వసూలు చేయవద్దని ఆదేశాలిచ్చారు. దీంతో కాకి నాడ జిల్లా కొత్తపల్లి, తొండంగి మండలాల పరి ధిలో 1551మంది రైతులకు మేలు చేకూరనుంది.

సెజ్‌ రైతులకు ఊరట..

కాకినాడ సెజ్‌ పరిధిలో రైతులకు వెనక్కిచ్చిన భూమి తిరిగి రైతుల పేరున రిజిస్ట్రేషన్‌ కాక సత మతమవుతున్నారు. దీంతో డిప్యూటీ సీఎం గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిచేస్తూ రైతులకు న్యా యం చేశారు. గత ప్రభుత్వంలో కేఎస్‌ఈజెడ్‌ భూములపై జీవోనెం.12 విడుదలైనా క్షేత్ర స్థా యిలో రైతులకు మేలు జరగలేదు. దీంతో పిల్లల పెళ్లిళ్లు, చదువుల నిమిత్తం భూములు ఉపయో గపడడంలేదని రైతులు గతంలో పవన్‌కల్యాణ్‌కు నివేదించారు. దీంతో మేలు జరిగేలా చూస్తానని అప్పట్లో రైతులకు హామీ ఇచ్చారు. ఈ సమస్య ను ఇటీవల శాసనమండలి సమావేశాల్లో ప్రభు త్వ విప్‌ గిడుగు హరిప్రసాద్‌ కూటమి ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్య మరో సారి చర్చనీయాంశమైంది. మంగళవారం మధ్యా హ్నం ప్రభుత్వం కాకినాడ సెజ్‌ రైతులకు స్టాం ప్‌, రిజిస్ట్రేషన్‌ డ్యూటీని మినహాయించి తిరిగి రైతుల భూములు వారికి తిరిగి రిజిస్ట్రేషన్‌ చేసే లా ఆదేశాలిచ్చింది. దీంతో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడికి, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

భూముల బదిలీకి ఫీజుల్లేవు

కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌

కలెక్టరేట్‌(కాకినాడ)/కొత్తపల్లి, అక్టోబరు14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూ ములను రైతుల పేరున బదిలీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు పూర్తిగా మినహాయింపు ఇచ్చిందని కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మో హన్‌ మంగళవారం తెలిపారు. ఈ మినహా యింపు 1899 స్టాంపు చట్టం సెక్షన్‌9 (1) (ఏ), 1908 రిజిస్ట్రేషన్‌ చట్టం సెక్షన్‌ 78 ప్ర కారం అమలుచేస్తారని ప్రభుత్వం తెలిపింద న్నారు. ఈ మినహాయుంపు రైతుల భూమి బదిలీలకు మాత్రమే వర్తిస్తుంది.

పవన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం

కొత్తపల్లి, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): సెజ్‌ భూములు తిరిగి రైతులకే ఉచి తంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారిక ప్రకటన వెలువడంపై రైతులు ఆనం దం వ్యక్తం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్‌ ఫ్లెక్సీలకు ము మ్మిడివారిపాడు, రావివారిపోడు గ్రామాలతోపాటు పొన్నాడ శివారు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద సెజ్‌ రైతులు పాలాభిషేకాలు చేశారు. జనసేన పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్‌ జ్యోతుల శ్రీని వాస్‌, తెలగంశెట్టి శ్రీనివాసరావు, పిల్లా శివశంకర్‌, బాపన్నదొర పాల్గొన్నారు.

దెబ్బతిన్న బోట్లకు రూ.72 లక్షల పరిహారం

గురువారం సభలో హామీ ఇచ్చి.. నెరవేర్చిన పవన్‌

కొత్తపల్లి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ మినీహార్బర్‌ వద్ద దెబ్బతిన్న మత్స్యకారుల బోట్లకు ప్రభుత్వం రూ.72 లక్షల నష్టపరిహారం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొం ది. నాలుగు రోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు కాకినాడ వచ్చారు. అక్కడ కలెక్టరేట్‌లో మత్స్యకార ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉప్పాడ హార్బర్‌ డిజైన్‌ లోపం కారణంగా తమ బోట్లు దెబ్బతిన్న విషయాన్ని మత్స్యకారులు ఆయన దృష్టికి తీసు కెళ్లారు. ఉప్పాడలో జరిగే సభకు వెళుతూ విహంగ వీక్షణం ద్వారా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హార్బర్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. బోట్లు నష్టపోయిన మత్స్యకా రులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం డిప్యూటీ సీఎం చొరవతో హార్బర్‌లో దెబ్బతిన్న బోట్లకు రూ.72 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు మత్స్యకారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:56 AM