Share News

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:50 AM

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై దర్యాప్తు కొనసాగుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ స్ప ష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఇతర కేసులపై ఏర్పాటు చేసిన మీడియా సమా వేశం అనంతరం ఆయన మాట్లాడుతూ పాస్టర్‌ ప్రవీణ్‌ మృతికి సంబంధించి వివి

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై దర్యాప్తు కొనసాగుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ స్ప ష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఇతర కేసులపై ఏర్పాటు చేసిన మీడియా సమా వేశం అనంతరం ఆయన మాట్లాడుతూ పాస్టర్‌ ప్రవీణ్‌ మృతికి సంబంధించి వివిధ ఏజెన్సీలతో కలిపి పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ తదితర నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటికీ ఎవ రి వద్దనైనా ఏమైనా ఆధా రాలుంటే పోలీసులకు స మర్పించాలని సూచిం చారు. వారు చెప్పే విషయాలు ఆధార సహితంగా ఉండాలని, వదంతులను ఆధారంగా తీసుకుని ప్ర కటనలు చేయలేమన్నారు. సోషల్‌ మీడియాలో లే దా బహిరంగంగా, ఆధారరహితంగా ఏవైనా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Apr 10 , 2025 | 12:50 AM