ప్రయాణికుల దాహార్తి
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:45 PM
నిత్యం వందలాది మంది ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే గోకవరం ఆర్టీసీ డిపోలో తాగు నీటి ఎద్దడి నెలకొంది. సుమారు నెల రోజుల పైబడి ఇక్కడ తాగునీటి సమస్య నెలకొన్న ప్పటికీ డిపో యాజమాన్యం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.
గోకవరం ఆర్టీసీ డిపోలో తాగునీటి సమస్య
పట్టించుకోని నిర్వాహకులు.. ప్రయాణికుల అవస్థలు
గోకవరం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): నిత్యం వందలాది మంది ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే గోకవరం ఆర్టీసీ డిపోలో తాగు నీటి ఎద్దడి నెలకొంది. సుమారు నెల రోజుల పైబడి ఇక్కడ తాగునీటి సమస్య నెలకొన్న ప్పటికీ డిపో యాజమాన్యం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. కొంతకాలంగా సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగడంతో డిపోలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌కు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. అప్పటి నుంచి ప్రయాణికులు వినియోగించే వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా మారిపోయింది. దీం తో ప్రయాణికులకు డిపో ఆవరణలో ఎక్కడా తాగునీరు లభించడంలేదు. దీంతో ఈ డిపో నుంచి రాకపోకలు సాగించే వారు బయట దుకాణాల వద్ద వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసుకొని దాహం తీర్చుకుంటున్నారు.
ప్రత్యామ్నాయం చూపలేదు
డిపో ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్‌కు మంచినీరు సరఫరా లేక ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారు. కొన్ని రోజులుగా తాగు నీటి సమస్య వేధిస్తున్పటికీ డిపో నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడంతో ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులు సమ్మె విరమిస్తేనే గాని డిపోకు వచ్చే ప్రయాణికులకు తాగునీరు లభించే అవకాశం లేదని ప్రయాణికులు అంటున్నారు.