Share News

పిల్లల కళ్లెదుటే తల్లిదండ్రులు దుర్మరణం

ABN , Publish Date - May 25 , 2025 | 12:46 AM

దేవరపల్లి, మే 24(ఆంధ్రజ్యోతి): పిల్లలు కాల కృత్యాల కోసం ద్విచక్రవాహనాన్ని రోడ్డుపక్కన ఆపిన తల్లిదండ్రులను మృత్యువు లారీ రూపం లో కబళించింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందిన హృదయ విధారకర ఘటన తూ ర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్‌ జంక్షన్‌ సమీపంలో శనివారం జరిగింది. పోలీసులు, కు టుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోపాలపు రం గ్రామానికి చెందిన తొంటా దుర్గా

పిల్లల కళ్లెదుటే తల్లిదండ్రులు దుర్మరణం
పోలీస్‌స్టేషన్‌ వద్ద విలపిస్తున్న చిన్నారులు

లారీ రూపంలో మృత్యువు

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి

డైమండ్‌ జంక్షన్‌ వద్ద ఘటన

గోకవరం మండలం

గోపాలపురంలో విషాదఛాయలు

దేవరపల్లి, మే 24(ఆంధ్రజ్యోతి): పిల్లలు కాల కృత్యాల కోసం ద్విచక్రవాహనాన్ని రోడ్డుపక్కన ఆపిన తల్లిదండ్రులను మృత్యువు లారీ రూపం లో కబళించింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందిన హృదయ విధారకర ఘటన తూ ర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్‌ జంక్షన్‌ సమీపంలో శనివారం జరిగింది. పోలీసులు, కు టుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోపాలపు రం గ్రామానికి చెందిన తొంటా దుర్గాప్రసాద్‌ (32), తొంటా సిరి (29) భార్యభర్తలు. వారికి 11ఏళ్ల కుమార్తె ప్రవల్లిక, 9ఏళ్ల కుమారుడు ఇమ్మానుయేల్‌ ఉన్నారు. దుర్గాప్రసాద్‌ తాపీ మేస్త్రీగా, అతడి భార్య సిరి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. దుర్గాప్రసాద్‌ అన్నయ్య తొంటా ముసలయ్య దేవరపల్లి మండలం యాద వోలు లో ఉండడంతో సెలవులు వచ్చినప్పుడల్లా ఇక్క డికి వస్తుంటారు. దానిలో భాగంగా శనివారం గోపాలపురం నుంచి యాదవోలు బయల్దేరారు. మార్గమధ్యంలో దేవరపల్లి డైమండ్‌ జంక్షన్‌కు వచ్చేసరికి పిల్లలకు టాయిలెట్స్‌ నిమిత్తం వాహ నాన్ని రోడ్డుపక్కన ఆపారు. ఈ క్రమంలో దురా ్గప్రసాద్‌, అతడి భార్య బండి వద్ద నిల్చొని తన వెంట తెచ్చుకున్న మామిడికాయల సంచిను సరిచేస్తుండగా రాజమండ్రి వైపు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న లారీ అతివేగంతో ఢీ కొని వారిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడి కక్కడే మృతిచెందారు. పిల్లల కళ్ల ముందే ఈ ఘోర సంఘటన జరగడంతో వారితో పాటు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ నాగేశ్వర్‌నాయక్‌, ఎస్‌ఐ సుబ్రహ్మ ణ్యం పరిశీలించారు. మృతదేహాలను గోపాలపు రం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చి న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడి పి ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్‌ చర్లప ల్లికి చెందిన శ్రీశైలంనుపోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated Date - May 25 , 2025 | 12:46 AM