Share News

ఆనందాలబడి!

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:39 AM

బడి వాతావరణం మారిపోయింది.. మామిడి తోరాణాలు..స్వాగతం బోర్డులతో నిండిపోయాయి..పూలదండలతో అలంక రిం చుకొన్న బడులు తల్లిదండ్రులు, ప్రముఖులకు స్వాగతం పలికాయి.

ఆనందాలబడి!
పెరవలి మండలం ముక్కామలలో విద్యార్థులతో మంత్రి కందుల దుర్గేష్‌

సందడిగా పాఠశాలలు

తరలివచ్చి పేరెంట్స్‌

ఆనందంగా చిన్నారులు

మంచిపై అవగాహన

ప్రభుత్వ బడుల్లో నిర్వహణ

5 లక్షల మంది హాజరు

రాజమహేంద్రవరం, డిసెంబరు 5 (ఆంధ్ర జ్యోతి) : బడి వాతావరణం మారిపోయింది.. మామిడి తోరాణాలు..స్వాగతం బోర్డులతో నిండిపోయాయి..పూలదండలతో అలంక రిం చుకొన్న బడులు తల్లిదండ్రులు, ప్రముఖులకు స్వాగతం పలికాయి. భారీ టెంట్‌లు.. మరో పక్క వంటలు.. ఇంకో పక్క నిన్నటి వరకూ పుస్తకాలతో నీరసంగా బడిబాట పట్టిన చిన్నా రులు.. శుక్ర వారం ఆడుతూ పాడుతూ బడి కొచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వర కూ ఆనందంగా గడిపారు. తల్లిదండ్రులు, గురువుల ఆత్మీక కలయిక పండుగ వాతా వరణంలో జరిగింది. జిల్లాలో 988 ప్రభుత్వ, 586 ప్రైవేటు పాఠ శాలల్లోని 2,37,754 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, అధికారులు, ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు తదితరులు కలిపి సుమారు 5 లక్షల మంది వేడుకలకు హాజరయ్యారు. పిల్లల బంగారు భవితకు బడి వైపు ఒక్క అడుగు ముందుకు అనే నినాదంతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరవలి మం డలం ముక్కామలలో మంత్రి దుర్గేష్‌, తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో కలెక్టర్‌ కీర్తి చేకూరి, కొవ్వూరులో ఎస్పీ నరసింహ కిశోర్‌ పాల్గొన్నారు. ధవళేశ్వరంలో రాజమ హేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి,రాజమహేం ద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, బిక్కవోలు మండలం పందలపాకలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కోరుకొండలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరులో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వ రరావు, నల్లజర్ల మండలం దూబ చర్లలో గోపాలపురం ఎమ్మెల్యే మద్ది పాటి వెంకటరాజు కార్యక్రమాల్లో భాగ స్వాములయ్యారు. చిన్నారులతో ముచ్చటించారు. కలిసి భోజనం చేశా రు..వారు చేసిన సైన్స్‌ ప్రాజె క్టులు చూసి ఆనందం వ్యక్తం చేశారు. మా చిన్నప్పుడు అంటూ తమ పాత రోజులను గుర్తు చేసుకు న్నారు.ఉన్నత స్థాయికి ఎదిగే క్రమంలోని పరిశ్రమ, పట్టుదల, లక్ష్యసాధనను వివరించారు. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రు లకు ఉపాధ్యాయులు నివేదించారు. విద్యార్థుల సైన్స్‌ ప్రాజెక్టులు, క్రాఫ్టులు ఆలో చింపజేశాయి. ప్రోగ్రెస్‌ కార్డులను అందించారు. విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ పెద్దలు భోజ నాలు చేశారు. సెల్ఫీలు సందడి చేశాయి.

రేపటి భవిష్యత్‌ మీరు : మంత్రి

నేను మీ స్థాయి నుంచి వచ్చినవాడినే.. రేపటి భవిష్యత్‌ మీరు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మాణ మవుతుంది. ప్రతీ అంశం గురువుల ద్వారా విద్యార్థులకు తరగతి గదిలోనే బోధపడుతుంది. పాఠశా లకు పంపించడమే కాకుండా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజున పిల్లలు పాఠశాల లో ఏమి నేర్చుకున్నారో తల్లిదండ్రులు గమనించడం ముఖ్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుసంధానం లేకపోతే పిల్లలను తీర్చిదిద్దం కష్టం.

సృజనాత్మక బోధన సాగాలి : కలెక్టర్‌

ఒకప్పుడు నేను మీకులాగే స్టూడెంట్‌ని.. ఇప్పుడు కలెక్టర్‌నయ్యా.. అదెలా సాధ్యమైందంటే.. నాకంటూ ఒక గోల్‌ .. పట్టుదల.. పట్టుదల ఉంటే కానిదిలేదు.. మీరు అలాగే లక్ష్యం పెట్టుకోండి..పట్టుదలగా చదవండి.. సృజనాత్మకత పెంపొందించేలా బోధన సాగాలి. విద్యార్థులు నేర్చుకునే విధానంలో సాంకేతికత ఎంత వరకూ ఉపయో గపడుతోంది. అసైన్‌మెంట్లను మొబైల్‌లో చూసి కేవలం రాసే అలవాటుతో నిజమైన అభ్యాసం జరుగుతోందా అనే అంశాలను ఉపాధ్యాయులు సమీక్షించాల్సిన అవసరం ఉం ది. సెల్‌ఫోన్‌ వల్ల కంటి చూపుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్కూల్స్‌లో ఉన్న అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు విద్యార్థుల్లోని ఆవిష్కరణల ఆలోచనలను వెలికి తీయాలి. ప్రతి విద్యార్థి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం మన సంయుక్త బాధ్యత. వారి బంగారు భవిష్యత్తుకు దిశ స్పష్టం గా ఉండే విధంగా మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రులు, అధికారులు, ఉపాధ్యాయుల కర్తవ్యం.

ఫస్ట్‌ మాస్టార్‌ని.. తర్వాతే ఎస్పీనయ్యా!

నేడు ఒకప్పుడు టీచర్‌ని..మీలాంటి ఎంతో మంది పిల్లలకు పాఠాలు చెప్పినవాడిని.. సమాజానికి ఏదో ఒకటి చేయా లనే సంకల్పంతో చదివా పోలీస్‌నయ్యా.. మీ జిల్లా ఎస్పీగా ఉన్నా. పట్టుదల ఉంటే కానిది ఉండదు.. పట్టుదలగా చదవాలి.. ఎదగాలి. తల్లితండ్రులు పిల్లలను చదివించడమే కాకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాదకద్రవ్యాలు ఒకప్పుడు మారుమూల మన్యం లో మాత్రమే ఉండేవి. నేడు మెరుగైన రవాణా, సెల్‌ఫోన్‌ వినియోగంతో విద్యార్థులకు సైతం అందుబాటులోకి వస్తుంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో చెడు అలవాట్ల కారణంగా క్రైమ్‌ పెరుగుతుంది. ఈ క్రైమ్‌లో ఎక్కువగా మహిళలు, పిల్లలు బాధితులుగా ఉంటున్నారు. కొవ్వూరు పాఠశాలలో పనిచేస్తున్న తన మిత్రుడు రవికుమార్‌ ఆహ్వానంపై ఈ కార్యక్రమానికి రావడం జరిగింది.

Updated Date - Dec 06 , 2025 | 12:39 AM