Share News

ఎగిరెల్లి పాపికొండలు..చూసొద్దాం!

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:56 AM

చుట్టూ పచ్చని కొండలు.. ఆ కొండల మధ్య నుంచి వయ్యారాలు పోతూ సాగిపోయే గోదా వరి.. మధ్యలో ఇసుక తిన్నెలు.. ఆ పక్కనే ప్రకృతి ప్రేమికుల మనసు దోచే అడవులు..ఇలా ఒకటేంటి పాపికొండల నడుమ గోదావరి అం దాల గురించి వర్ణించాలంటే మాటలు చాలవు.

ఎగిరెల్లి పాపికొండలు..చూసొద్దాం!

టెండర్లు ఆహ్వానించిన ఏపీటీడీసీ

హెలీకాప్టర్‌ నుంచి గోదావరి వీక్షణ

రాజమండ్రి టూ పాపికొండలు

బోట్లో వెళ్లి రావాలంటే పది గంటలు

విమానంలో అయితే అరగంటే

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

చుట్టూ పచ్చని కొండలు.. ఆ కొండల మధ్య నుంచి వయ్యారాలు పోతూ సాగిపోయే గోదా వరి.. మధ్యలో ఇసుక తిన్నెలు.. ఆ పక్కనే ప్రకృతి ప్రేమికుల మనసు దోచే అడవులు..ఇలా ఒకటేంటి పాపికొండల నడుమ గోదావరి అం దాల గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. అయితే వీటిని ఇప్పటి వరకు బోట్ల ద్వారా మాత్రమే వీక్షించి తన్మయం పొందే పర్యా టకులకు త్వరలో ఆకాశం నుంచి సైతం చూసే వీలుగా పర్యాటకశాఖ సన్నాహాలు చేస్తోంది. హెలీ టూరిజంలో భాగంగా హెలీకాప్టర్‌లో పర్యాటకులను తీసుకెళ్లి తీసుకువచ్చేలా కొత్తగా ప్రతిపాదనలు తయారుచేసింది. ఈ మేరకు హెలీటూరిజం.. జాయ్‌ రైడ్‌ పేరుతో టెండర్లు పిలిచింది. ఆసక్తిగల సంస్థలు రాజమహేంద్ర వరం నుంచి పాపికొండలకు హెలీకాప్టర్‌లో పర్యాటకులను తీసుకెళ్లి తీసుకువచ్చేలా ముం దుకు రావాలని కోరింది. ఇది గనుక నెరవేరితే త్వరలోనే పాపికొండలను ఎంచక్కా హెలీకాప్టర్‌ లో తక్కువ సమయంలో చుట్టి వచ్చేయ వచ్చు. ప్రస్తుతం రాజమహేంద్రవరం నుంచి పాపికొండలకు వెళ్లి రావాలంటే పది గంటల వరకు సమయం పడుతోంది. కానీ అరగంట వ్యవధిలోనే ఇలా వెళ్లి వచ్చేయవచ్చు.

ఎన్ని అందాలో...

గోదావరి.. పాపికొండలు.. ఈ రెండింటి నడు మ ప్రకృతి అందాలు అన్నీ ఇన్నీ కావు. ప్రకృతి ప్రియుల మనసు దోచే సుందర దృశ్యాలెన్నో ఇక్కడ కనువిందు చేస్తాయి. అందుకే అనేక సంస్థలు గోదారి ఒడ్డున ఇసుక తిన్నెల్లో ప్రత్యేక గుడారాలు నిర్మించి మరీ గోదారి అందాలను అనుభవించేలా ప్యాకేజీలు వసూలు చేసి అల రిస్తున్నాయి. ఎండాకాలం, శీతాకాలంలో అయి తే గోదావరి అందాలను వర్ణించడానికి మాట లు చాలవు. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాం తాల నుంచి వచ్చే పర్యాటకులు అయితే రాజ మహేంద్రవరం నుంచి పాపికొండలకు బోటు షికారు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు ఈ అందాలను బోట్ల ద్వారానే కాకుండా ఆకాశ మార్గాన కూడా హెలీకాప్టర్‌లో చూపించేం దుకు పర్యాటకశాఖ సిద్ధమవుతోంది. పర్యాట కులను అలరించేందుకు పర్యాటక శాఖ ఈ మార్గంలో హెలీకాప్టర్‌ను నడిపాలని భావి స్తోంది. తద్వారా మరింత మంది టూరిస్టులను ఆకట్టుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

టెండర్లు ఆహ్వానం

రాజమహేంద్రవరం నుంచి పాపికొండల వరకు పర్యాటకుల రద్దీ ఆధారంగా హెలీకాప్టర్‌ సర్వీ సును అందుబాటులో తేవాలని నిర్ణయిం చింది. తాజాగా హెలీటూరిజం కింద టెండర్లు పిలిచింది. సెప్టెంబరు నాలుగో తేదీలోగా తమ ఆసక్తిని వ్యక్తీకరిస్తూ దరఖాస్తు చేసుకోవాలని ఏవియేషన్‌ కంపెనీలను కోరింది. పాపికొండ లతోపాటు అరకులోనూ ఈ సేవలను ప్రారం భించాలని భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళంలో ఈ సేవలను అధికారులు ప్రారం భించారు. పాపికొండలకు హెలీ టూరిజం సేవలు ప్రారంభిస్తే రద్దీ భారీగా ఉంటుందని ఇప్పటికే పర్యాటకశాఖ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం బోట్లలో పాపికొండలకు వెళ్లి రావడా నికి పది గంటల వరకు సమయం పడుతోంది. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన పర్యాట కులకు ఒక రోజు వృథా అవుతోంది. అంతే కాకుండా నీటిలో ప్రయాణం అంటే భయ పడేవారు అధికం. గతంలో జరిగాన్ని ప్రమా దాన్ని తలచుకుని పాపికొండల ప్రయాణం మానుకున్నవారెందరో. హెలీ టూరిజం సేవలు అందుబాటులోకి వస్తే అర గంటలోగా పాపి కొండలు చుట్టి వచ్చేయవచ్చు. పాపికొండలకు బోట్లు ఆయా తరగతిని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నాయి. హెలీ కాప్టర్‌కు ఎంత వసూలు చేస్తారనేది ఎంపికైన కంపెనీతో చర్చించి నిర్ణయించనున్నారు. ఇదిలా ఉంటే 2027 జూలై నుంచి గోదావరి పుష్క రాలు మొదలుకానున్నాయి. దీనికి లక్షలాది మంది భక్తులు రానున్నారు. ఈలోగా హెలీ టూరిజం ప్రారంభించి ప్రాముఖ్యతను పెంచితే పుష్కరాలకు వచ్చే భక్తులు, పర్యాటకుల నుంచి హెలీ టూరిజానికి మరింత రద్దీ పెరుగు తుందని అధికారులు భావిస్తున్నారు.

==============================

Updated Date - Aug 31 , 2025 | 12:56 AM