Share News

అరగంటసేపు భయం భయం...

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:17 AM

అంతర్వేది, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి-నర్సాపురం వశిష్ట గోదావరి రేవు మధ్యలో ప్రయాణికులతో వెళ్తు న్న పంటు ఆదివారం అరగంటసేపు నిలిచిపోయింది. పంటుకు ఉన్న ఎక్సలేటర్‌ వైరు తెగి ప్రయాణికులు వాహనాలతో ఆగిపోవడం

అరగంటసేపు భయం భయం...
సఖినేటిపల్లి రేవులో పంటును వేరే పంటు సాయంతో ఒడ్డుకు తీసుకెళ్తున్న దృశ్యం

ఎక్సలేటర్‌ వైరు తెగి గోదావరిలో నిలిచిపోయిన పంటు

ప్రయాణికుల బెంబేలు

మరోపంటు సాయంతో క్షేమంగా ఒడ్డుకు

అంతర్వేది, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి-నర్సాపురం వశిష్ట గోదావరి రేవు మధ్యలో ప్రయాణికులతో వెళ్తు న్న పంటు ఆదివారం అరగంటసేపు నిలిచిపోయింది. పంటుకు ఉన్న ఎక్సలేటర్‌ వైరు తెగి ప్రయాణికులు వాహనాలతో ఆగిపోవడంతో భయాందోళన చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి సఖినేటిపల్లి రేవుల మధ్య నిత్యం వేలాది మంది పంటుపై ప్రయాణాలు సాగిస్తుంటారు. ఆదివారం ఉదయం పంటు గోదావరిలో నిలిచిపోవడంతో వేరే పంటు సాయంతో నిలిచిపోయిన పంటును ఒడ్డుకు తీసుకువచ్చారు. సఖినేటిపల్లి రేవులో గోదావరిపై అంతర్వేది సాగర సంగమం నుంచి వచ్చే ఆటుపోట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిలిచిపోయిన పంటు స్థిరంగా ఉండక పాటు సమయం కావడంతో నెమ్మదిగానే కదలిక సాగింది. అదే పోటు సమయంలో అయితే పంటు వేగానికి అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సుమారు 80 మంది ప్రయాణికులు, సుమారు 20 దిచక్రవాహనాలు, ఒక కారు పంటులో ఉన్నాయి. పంటును ఒడ్డుకు తీసుకురావడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Dec 08 , 2025 | 12:17 AM