Share News

బౌద్ధ క్షేత్రంగా పాండవుల కొండ

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:06 AM

ప్రముఖ బౌద్ధక్షేత్రం పాండవుల కొండను పర్యాటకంగా అభి వృద్ధి చేస్తామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

బౌద్ధ క్షేత్రంగా పాండవుల కొండ
పాండవుల కొండ వద్ద వివరాలు తెలుసుకుంటున్న ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల, బీవీఆర్‌

కోరుకొండ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ బౌద్ధక్షేత్రం పాండవుల కొండను పర్యాటకంగా అభి వృద్ధి చేస్తామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలో ఉన్న పాండవుల కొండను గురువారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, అధికారులతో కలిసి సందర్శించారు. బౌద్ధ వారసత్వ ప్రదేశమైన ఈ పాండవుల కొండ పరిరక్షణ ఎంతో అవసరం అన్నారు. కొండపైన గత రాతి గుహలు, స్థూపాలు, ఆరామాలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక చిహ్నంగా ఉందన్నారు. విజయవాడలోని కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ కొండను జాతీయ స్మారక చిహ్నంగా ఏనాడో గుర్తించారన్నారు. ప్రస్తుతం ఈ కొండ శిఽథిలావస్థలో ఉందని దీనికి తక్షణ పరిరక్షణ అవసరం అన్నారు. పాండవుల కొండను బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఆమె వెంట బీజేపీ నాయకులు ఏపీఆర్‌ చౌదరి, అడపా సుధీర్‌కుమార్‌, టీడీపీ నాయకులు కంటే నాగ కేశవరావు, జనసేన నాయకులు తెలగంశెట్టి శివ, బదిరెడ్డి దొర, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 01:06 AM