పంచాయితీలు 101
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:39 AM
గ్రామాల పరిధిలో భవన నిర్మాణాలు పెరుగుతున్నా పంచాయతీల ఆదా యం మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. కొంతమంది అధికారుల పనితీరు వల్ల పంచాయతీలకు రావాల్సిన ఆదాయం కుం టుపడుతోంది.
8 మంది విచారణాధికారులు
101 గ్రామాల్లో పరిశీలన
30లోపు నివేదికకు ఆదేశాలు
పంచాయతీల ఆదాయమే టార్గెట్
తేలనున్న అవినీతి లెక్కలు
మేజర్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి
రాజమహేంద్రవరం రూరల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): గ్రామాల పరిధిలో భవన నిర్మాణాలు పెరుగుతున్నా పంచాయతీల ఆదా యం మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. కొంతమంది అధికారుల పనితీరు వల్ల పంచాయతీలకు రావాల్సిన ఆదాయం కుం టుపడుతోంది. దీనిపై కలెక్టర్ స్పందించారు. ఆ యా పంచాయతీల లెక్కలు తేల్చాలని నిర్ణ యించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల పనితీరు, గ్రామాల్లో ఇంటింటా చెత్త సేకరణ, ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా వస్తున్న ఫిర్యాదులు తదితర అంశాలపై జిల్లా వ్యాప్తం గా 101 పంచాయతీలకు సంబంధించి 8 మం ది అధికారులను నియమించి క్షేత్ర స్దాయిలో పరిశీలించి ఈ నెల 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఫ రాజమహేంద్రవరం రూరల్ మండలంలో 9 గ్రామాలతో పాటు వేమగిరి గ్రామానికి జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి.
ఫ గోకవరం మండల పరిధి గోకవరం, గుమ్మ ళ్లదొడ్డి,కామరాజుపేట,కొత్తపల్లి,కోరుకొండ మండలం కోరుకొండ,మధురపూడి, సీతా నగరం మండలం చినకొండేపూడి, ముగ్గళ్ళ, మునికూడలి,రఘుదేవపురం, వం గలపూడి, కడియం మండల పరిధి కడియం, కడియ పులంక,మాధవరాయుడుపాలెం గ్రా మా లకు డీఎల్‌పీవో అమ్మాజీని నియమించారు.
ఫ కొవ్వూరు డివిజన్ గోపాలపురం మండల పరిధి గోపాలపురం, గుడ్డిగూడెం, కరిచర్ల గూడెం, వాదాలకుంట, వేళ్లచింతలగూడెం, నల్లజర్ల మండల పరిధి అనంతపల్లి, ఆవ పాడు, దూబచర్ల,నల్లజర్ల, పోతవరం, ప్రకా శరావుపాలెం,తెలికిచర్ల, తాళ్లపూడి మండల పరిధి అన్నదేవరపేట,పెద్దేవం, తాళ్లపూడి, వేగేశ్వరపురం గ్రామాలకు రాజమండ్రి డీ ఎల్‌పీవో నాగలతను నియమించారు.
ఫ చాగల్లు మండల పరిధి మల్లవరం, నేల టూరు,ఊనగట్ల,నిడదవోలు మండల పరిధి కలవచర్ల, సమిశ్రగూడెం, తాడిమళ్ళ, దేవర పల్లి మండల పరిధి బంధపురం, చిన్నాయి గూడెం, దేవరపల్లి, దుద్దుకూరు, కొవ్వూరు మండల పరిధి దొమ్మేరు, కుమారదేవం గ్రా మాలకు డీడీవో రాజమహేంద్రవరం వీణా దేవిని నియమించారు.
ఫ రాజానగరం మండల పరిధి చక్రద్వార బంధం,దివాన్‌చెరువు, జి.యర్రంపాలెం, కలవచర్ల, కానవరం, కొండగుంటూరు, కొత్త తుం గపాడు, పాలచర్ల, పాత తుంగపాడు, రాజానగరం, తోకాడ, వెలుగుబంద గ్రామా లకు కొవ్వూరు డీడీవోను నియమించారు.
ఫ చాగల్లు మండల పరిధి చాగల్లు, బ్రాహ్మణ గూడెం, చిక్కాల, కలవలపల్లి, దేవరపల్లి మండల పరిధి యాదవోలు, యర్నడూడెం, రాజ మహేంద్రవరం డివిజన్ పరిధి రం గంపేట, వడిశలేరు, బిక్కవోలు మండలం పందలపాక, వూలపల్లి గ్రామాలకు పంచాయతీరాజ్ ఎస్ ఈని నియమించారు.
ఫ రాజమహేంద్రవరం డివిజన్ అనపర్తి మండల పరిధి అనపర్తి, కొప్పవరం, కు తుకులూరు, మహేంద్రవాడ, పొలమూరు, రామవరం, బిక్కవోలు మండల పరిధి బలబద్రపురం, బిక్కవోలు, కామరాజు పాలెం, కొంకుదురు, మల్లూరు గ్రామాలకు ఎస్‌ఈ ఆర్‌డబ్ల్యూఎస్.
ఫ కొవ్వూరు మండల పరిధి ఐ.పంగిడి, సీతం పేట, వాడపల్లి, ఉండ్రాజవరం మండలం చివటం, కె.సావరం, కాల్దరి, మోర్త, పాల ంగి, సత్యవాడ, వేలివెన్ను, ఉం డ్రాజ వరం,కానూరు, గౌరీపట్నం, లక్ష్మీపురం గ్రా మాలకు రాజమహేంద్రవరం ఏవో , డీ ఎల్‌పీవో కె.వెంకటేశ్వరరావులను విచారణా ధికారులుగా నియమించారు. సంబందిత అధికారులు గ్రామాల్లో పర్యటించి పన్నుల వసూళ్ళు, పన్నుల మదింపు, గ్రామాల్లో పారిశుఽధ్య నిర్వహణ, సాలిడ్ వెల్త్ మేనేజ్‌మెంట్ యూనిట్ల పనితీరు, భవన నిర్మాణాలు ప్లాన్ ప్రకారం నిర్మించారా, డీవియేషన్ ఉన్నాయా, పన్నుల మదిం పులో వ్యత్యాసాల వల్ల పంచాయతీకి ఏ మేరకు నష్టం వాటిల్లింది తదితర అంఽశా లతో కూడిన నివేదిక ఈ నెల 30 లోగా సమర్పించాలని ఆదేశాలు అందజేశారు.