Share News

అవినీతి పంచాయితీలు!

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:54 AM

గ్రామ పంచాయతీల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోతు న్నాయి.కొన్ని పంచాయతీల్లో పాలకవర్గాలు, సెక్రటరీలు, ఆ డిటర్లు కుమ్మక్కయి రూ.కోట్లు దోచుకుంటున్న వైనం వెలు గులోకి వస్తున్నాయి.

అవినీతి పంచాయితీలు!
హుకుంపేట పంచాయతీ

90 పంచాయతీల్లో సమీక్షకు పట్టు

కలెక్టర్‌కు లేఖరాసిన జిల్లా ఆడిట్‌ అధికారి

రెండు పంచాయతీల్లో రీఆడిట్‌

రూ.5 కోట్లు లెక్క తేలిన వైనం

ఆ వెంటనే కొత్త అధికారి నియామకం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోతు న్నాయి.కొన్ని పంచాయతీల్లో పాలకవర్గాలు, సెక్రటరీలు, ఆ డిటర్లు కుమ్మక్కయి రూ.కోట్లు దోచుకుంటున్న వైనం వెలు గులోకి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం పరిధిలో జిల్లాలోని 300 పంచాయతీలు, రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్పొరేషన్‌, కొవ్వూరు, నిడదవోలు మునిసి పాలి టీలు,ఆలయాలు, మార్కెట్‌ కమిటీలు ఉంటాయి.ప్రతి ఏడాది వీటి ఆదాయ వ్యయాలను ఆడిట్‌ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.ఆడిట్‌ అధికారులు సెక్రటరీలు, పాలకవర్గాలతో కు మ్మక్కవడం వల్ల తప్పులన్నీ బుట్టదాఖలవుతున్నాయి.

జిల్లా ఆడిట్‌ కార్యాలయంలో గొడవలు

రాజమండ్రి ఆడిట్‌ కార్యాలయంలో జిల్లా అధికారి, ఇత ర ఆడిట్లకు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. 2023 మే నుంచి ఒకరింటే ఒకరికి పడని పరిస్థితి ఉండడంతో ఆ డిట్‌ పనులు ఆగిపోయాయి. ఇక్కడ మూకుమ్మడి సెలవులు పెట్టే పరిస్థితి రావడంతో పాటు పాత ఆడిట్‌ రిపోర్టులను తిరగదోడదానికి జిల్లా అధికారి నోటీసులు ఇచ్చే వరకూ వచ్చింది. చివరకు రాష్ట్ర స్థాయి అధికారులు ఇక్కడ విచారణ నిర్వహించారు.కానీ రిపోర్టు ఇంత వరకూ ఇవ్వలేదు. ఆడిట్‌ పనులు మొదలైనప్పటికీ గొడవలు తగ్గలేదు. జిల్లాలో 90 పంచాయతీల్లో ఆడిట్‌ను తిరిగి సమీక్షించాలనే జిల్లా అధి కారి నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించడం గమనార్హం.

సమీక్ష అలా.. బదిలీ ఇలా..?

2021-22లో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఆడిట్‌ జరిగింది. దానిపై ప్రస్తుత జిల్లా అధికారి పద్మజారాణి సంతకం చేసి వెబ్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. అంటే అప్ప టికి ఆమె అభ్యంతరం చెప్పవలసినవి ఏమీ లేనట్టేనని అర్ధం. కానీ ఇక్కడ ఏమి జరిగిందో కానీ ఇంత వరకూ ఇక్కడ జిల్లా ఆడిట్‌ అఽధికారిగా పనిచేసిన పద్మజారాణి జిల్లాలోని 90 పంచాయతీల్లో ఆడిట్‌ సమీక్షించాలని కోరుతూ జిల్లా కలె క్టర్‌కు లేఖ రాశారు. డీపీవో ఆయా పంచాయతీలకు నోటీ సు లు ఇచ్చారు.కానీ చాలా కాలం సమీక్ష జరగలేదు. ఇటీవల హుకుంపేట పంచాయతీలో జిల్లా అధికారి పద్మజ స్వయం గా విచారణ చేయగా రూ.4 కోట్ల వరకూ అవినీతి జరిగినట్టు తేలడం గమనార్హం. అంతకు ముందు వేమగిరిలో సమీక్షించి రూ.కోటి పైగా అవినీతి జరిగినట్టు రిపోర్టు ఇచ్చారు.ఈ పరి ణామాలు చూసిన తర్వాత ఒక పంచాయతీ సెక్రటరీ తనకు ఏమి జరుగుతుందనుకున్నారో ఆత్మహత్య యత్నం చేయడం గమనార్హం. ఎపుడో ఆడిట్‌ జరిగిన వాటిని తిరిగి సమీక్ష వద్దని సెక్రటరీలు, ఆడిటర్లు కొందరు ప్రజాప్ర తినిధుల వద్దకు వెళ్లడం గమనార్హం.చివరకు ఆమె బదిలీ అయ్యారు.

జిల్లా ఆడిట్‌ అధికారి బదిలీ..

జిల్లావ్యాప్తంగా 90 పంచాయతీల్లో భారీగా అవకతవ క లు జరిగాయని..ఆడిట్‌ సరిగ్గా జరగలేదని, వాటిని తిరిగి సమీక్షించాలని చెబుతూ, అధికారుల అనుమతి తీసుకుని, సమీక్షలు మొదలు పెట్టిన జిల్లా ఆడిట్‌ అధికారి పద్మజా రాణి బదిలీ అయ్యారు.ఆమెకు ఇంకా పోస్టింగ్‌ ఇవ్వలేదు. కానీ ఆమె స్థానంలో సుబ్బారెడ్డి అనే అధికారిని నియ మించారు.ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు.

90 పంచాయతీల్లో లెక్క తేలుతుందా?

దేవరపల్లి మండలం దేవరపల్లి, యర్నగూడెం, చిన్నా యి గూడెం, బందపురం, యాదవోలు, గౌరీపట్నం, పెరవలి మం డలం ఖండవల్లి, గోపాలపురం మండలం గోపాలపురం, చి ట్యాల, గుడ్డిగూడెం గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉం డ్రా జవరం మండలం పాలంగి, పసలపూడి, సూర్యారావు పాలెం, కె.సావరం ఉన్నాయి. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట, మలకలకపల్లి, తిరుగుడుమెట్ట, పెద్దేవం, వేగేశ్వరపురం, పోచ వరం, నల్లజర్ల మండలం అనంతపల్లి, తెలి కిచర్ల, అను మునిలంక, చీపురుగూడెం, చోడవరం ఈస్ట్‌, ప్రకాశరావు పాలెం పంచాయతీలు ఉన్నాయి. నిడదవోలు మండలం శెట్టిపేట, సమిశ్రగూడెం, కోరుమామిడి, తాడిమళ్ల, రావి మెట్ల, కంసాలిపాలెం, తిమ్మరాజుపాలెం ఉన్నాయి. చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం,చిక్కాల, నందిగంపాడు, కలవల పల్లి,చాగల్లు, ధర్మవరం, ఊనగట్ల పంచాయతీలు ఉన్నాయి. రంగంపేట మండలం రంగంపేట, నల్లమిల్లి, వీరంపాలెం, సీతానగరం మండలం చినకొండేపూడి, రఘు దేవపురం, సీతానగరం, బొబ్బిలంక, ముగ్గళ్ల, సింగవరం, కూనవరం ఉ న్నాయి. బిక్కవోలు మండలం బిక్కవోలు, బలభద్రపురం, కొం కుదురు, అనపర్తి మండలం కుతుకులూరు, మహేంద్రవాడ, అనపర్తి, కడియం మండలం కడియం,వేమగిరి, కడియపు లంక, దుళ్ల గ్రామాలు ఉన్నాయి. కోరుకొండ మండలం గాడా ల, కణుపూరు, జంభూపట్నం, మధురపూడి, వెస్ట్‌ గోన గూడెం, రాఘవాపురం, కాపవరం, గాదరాడ పంచాయతీలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్‌ రాజ వోలు, బొమ్మూరు, హు కుంపేట, కోలమూరు, ధవళేశ్వరం రాజానగరం మండలం దివాన్‌చెరువు, చక్రధ్వారబంధం, వెలుగుబంద, నరేంద్రపురం, కొండగుంటూరు, శ్రీకృష్ణపట్నం, కలవచర్ల, భూపాలపట్న,ం నామవరం, నందరాడ, సంపత్‌ నగరం,కొత్త తుంగపాడు, పాతతుంగపాడు, రాజానగరం పంచాయతీలు ఉన్నాయి. వీటిని ఇక సమీక్షిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Updated Date - Jun 13 , 2025 | 12:54 AM