Share News

పంచాయతీరాజ్‌ శాఖలో పదోన్నతులు

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:39 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి భారీస్థాయిలో పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 2 సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి చేసిన వారికి ప్రమోషన్‌ అర్హత ఉండగా ఇప్పుడు ఆ కాలాన్ని ఏ

పంచాయతీరాజ్‌ శాఖలో పదోన్నతులు

రెండేళ్ల సర్వీస్‌ను ఏడాదికి తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ

ఉమ్మడి జిల్లాలో నూతనంగా 60 డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి భారీస్థాయిలో పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 2 సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి చేసిన వారికి ప్రమోషన్‌ అర్హత ఉండగా ఇప్పుడు ఆ కాలాన్ని ఏడాదికి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా గ్రేడ్‌ 2 పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్‌ 1కి పదో న్నతి పొందనున్నారు. అలాగే 150 మందికి పైగా 1 పంచాయతీ కార్యదర్శులు డిప్యూ టీ ఎంపీడీవోలుగా పదోన్నతి పొందనున్నారు. ఇకపై గ్రామ సచివాలయాల పర్యవేక్షణ కోసం మండలస్థాయిలో డిప్యూటీ ఎంపీడీవో పోస్టులను నూతనంగా నియమించనున్నారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో ఉన్న 60 మండలాలకు డిప్యూటీ ఎంపీడీవోలు బాధ్యతలు చేపటి ఆయా మండలాల్లో సచివాలయాలను పర్యవేక్షించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనను ఆమోదించడంతో మార్గం సుగమమైంది.

Updated Date - Nov 06 , 2025 | 12:39 AM