సముద్రంలోకి పంపా నీరు విడుదల
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:50 PM
అన్నవరం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఎగువప్రాంతాల్లో 2 రోజులుగా కురుస్తున్న వ ర్షాలకు పంపా రిజర్వాయర్ నీటి మట్టం పెరుగుతుండడంతో ఇరిగేషన్ అధికా
98 అడుగుల నీటిమట్టం ఉండేలా చూడాలని ఉన్నతాధికారుల ఆదేశం
అన్నవరం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఎగువప్రాంతాల్లో 2 రోజులుగా కురుస్తున్న వ ర్షాలకు పంపా రిజర్వాయర్ నీటి మట్టం పెరుగుతుండడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా పంపా నీటిని వరదగేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 99 అడు గులు ఉండగా 98 అడుగులు నిర్వహణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారని డీఈ సంతోష్‌కుమారు తెలిపారు. ఎగువప్రాంతాల నుంచి 600 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరుతుండగా 600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్టు తెలిపారు.