మార్మోగిన సత్యదేవ నామస్మరణ
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:21 AM
అన్నవరం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రత్నగిరి ప్రాంగణం బుధవారం రాత్రి సత్యదేవ నామస్మరణతో మార్మోగింది. జిల్లా నలుమాలల నుంచి వేలాదిగా తరలివచ్చిన దీక్షాపరులతో ఆలయ ప్రాంగణం పసుపుమయంగా మారింది. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూ
అన్నవరం దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో పడిపూజా కార్యక్రమం
తరలివచ్చిన సత్యదీక్షా పరులు
అన్నవరం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రత్నగిరి ప్రాంగణం బుధవారం రాత్రి సత్యదేవ నామస్మరణతో మార్మోగింది. జిల్లా నలుమాలల నుంచి వేలాదిగా తరలివచ్చిన దీక్షాపరులతో ఆలయ ప్రాంగణం పసుపుమయంగా మారింది. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజా కార్యక్రమాన్ని దీక్షాపరులంతా భక్తిశ్రద్ధలతో ఆచరించారు. వార్షిక కల్యాణవేదిక వేదికపై అరటిడొప్పలతో అలంకరించిన వివిధ మండపాల్లో ప్రధానంగా సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను కుడివైపున క్షేత్రపాలకులు సీతారాములు, గణపతి, ఎడమభాగంలో పార్వతీ,పరమేశ్వరుల విగ్రహాలను ఉంచి అర్చకస్వాములు పడిపూజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముం దుగా గణపతిపూజ నిర్వహించారు. అనంతరం మారేడు, జమ్మి, తులసి తదితర దళాలతో దీక్షాపరులు తమ ముందున్న మండపంలో అర్చకస్వాములు సత్యదేవుడి అష్టోత్తర సహస్రనామాలు పఠించంగా మంత్రాలకుణుగుణంగా దీక్షాపరులు పూజలు గావించారు. భక్తిపాటలను దీక్షాపరులు ఆలపించారు. సుమారు 3వేలమంది అయ్యప్పస్వాములు, దీక్షాపరులు పాల్గొన్నారు. ఏ ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్ ఏర్పాట్లు చేశారు. దీక్షాపరులందరికీ అల్పాహారాన్ని దేవస్థానం అందించింది.
నేడు సత్యదీక్షల విరమణ
అత్యంత నియమనిష్టలతో 27 రోజులు, 18 రోజులు, 9రోజుల సత్యదీక్షలు స్వీకరించిన సత్యదీక్షాపరులు గురువారం సత్యదీక్షలు విరమింపచేయనున్నారు. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన కొందరు దీక్షాపరులు ఇరుముడులతో బుధవారం రాత్రికి ఆలయ ప్రాంగణానికి చేరుకోగా మరికొందరు వేకువజామున శిరస్సున ఇరుముడి ధ రించి విచ్చేశారు. సత్యదీక్షాపరుల ఇరుముడులు పురస్కరించుకుని వార్షిక కల్యాణవేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీక్షావిరమణ అనంతరం వారందరికీ ఉచిత సామూహిక సత్యదేవుడి వ్రతాలను నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.