Share News

సిరులొలికే!

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:38 AM

ఈ ఏడాది అన్నదాతకు పండగే.. ఎందుకంటే పండుగకు ముందే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి.. అన్నదాత కళ్లల్లో ఆనందాన్ని నింపాయి.

సిరులొలికే!

రైతు కళ్లల్లో సంక్రాంతి

8.93 లక్షల టన్నులు సేకరణ

ఇప్పటి వరకూ 2,027 కోట్లు జమ

24 గంటల్లోనే చెల్లింపులు

1.54 లక్షల రైతులకు ఆనందం

గత వైసీపీలో సొమ్ములకు నరకం

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది అన్నదాతకు పండగే.. ఎందుకంటే పండుగకు ముందే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి.. అన్నదాత కళ్లల్లో ఆనందాన్ని నింపాయి. 24 గంటల్లోగా ధాన్యం డబ్బులు.. ఒకనాడు కల.. కూటమి ప్రభుత్వం అది నిజం చేసి చూపింది.. రైతులను ఆనందంలో ముంచింది. గత ప్రభుత్వంలో 21 రోజులు గడువు విధించినా రైతులకు ఇక్కట్లే.. ఏనాడూ సక్రమంగా డబ్బులు జమచేసింది లేదు..అన్నదాతలు విసిగివేశారి దళారులకే విక్రయించుకునే వారు.. మరి నేడు.. 24 గంటల్లో ధాన్యం సొమ్ములు జమ చేస్తుండడంతో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్ర యించడానికి క్యూకడుతున్నారు. అత్యంత తక్కువ సమయంలో ధాన్యం డబ్బులు చేతికి రావడం చూసి ఎన్నేళ్లు అయిందోనని తల్చుకుని మురిసిపోతున్నారు... ఉమ్మడి జిల్లాలో అన్నదాతలకు ముందే సంక్రాంతి వచ్చింది. పం డగకు ముందే ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమవుతు న్నాయి. గతం లోలా డబ్బులకు ఎదురుచూపులు లేవు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణను కూటమి ప్రభుత్వం అక్టోబరు మొదటి వారంలో ప్రారంభించింది. అన్నదాతలు పండించిన ధాన్యం లో కోతలు పెద్దగా లేకుండా అవసరాలు పోను మిగిలిన ధాన్యం అంతా సేకరించాలని నిర్ణయిం చింది. కాకినాడ జిల్లాలో 3 లక్షల మెట్రిక్‌ టన్నులు, తూర్పుగోదావరి జిల్లాలో 4 లక్షల టన్నులు, కోనసీమ జిల్లాలో 3.50 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యం విధించు కుంది.ఈ మేరకు ఎక్కడి కక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి గింజలు ఇచ్చిన 24 గంటల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 8.93 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యా న్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా 1.54 లక్షల మంది అన్న దాతలకు రూ.2,027 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 90శాతానికిపైగా పూర్తి చేసింది.

కొనుగోళ్లు సాగాయిలా..

ప్రభుత్వం నిర్దేశించుకున్న 10.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి ఇప్పటి వరకు 8.93 లక్షల టన్నుల సేకరణ పూర్తయింది. కాకినాడ జిల్లాలో 2,42,633 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 47,656 మంది రైతులకు రూ.540 కోట్ల జమచేసింది. ఇంకా రూ.4.70 కోట్లు ప్రాసెస్‌లో ఉన్నాయి. కోనసీమ జిల్లాలో 3 లక్షల మెట్రిక్‌ ట న్నులు కొనుగోలు చేయగా 60,531 మంది రైతులకు రూ.707.50 కోట్లు జమచేశారు. రూ.7 కోట్లు చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 3.51 లక్షల మెట్రిక్‌ టన్నులు కొను గోలు చేయగా 45,750 మంది అన్నదాతలకు ఇప్పటి వరకు రూ.780 కోట్లు చెల్లింపులు జరిగాయి. ఒకరకంగా చెప్పాలంటే సంక్రాంతి పండగకు ముందే అన్నదాతలకు గింజల డబ్బులు జమవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నాడంతా నరకం..

గత వైసీపీ ప్రభుత్వంలో అన్నదాతలకు నరకంగా ఉం డేది. అప్పట్లో ఆర్‌బీకేల ద్వా రా ఽధాన్యం సేకరించిన ప్రభు త్వం 21 రోజులు దాటినా డబ్బులు చెల్లించేది కాదు. దీంతో సాగుకు చేసిన అప్పు లకు వడ్డీలు పెరిగి రైతులు ఇబ్బంది పడేవారు. కొందరు రైతులైతే అప్పులోళ్ల వేధిం పులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు. జగన్‌ ప్రభుత్వంలో ధాన్యం డబ్బులు రాక తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడికి చెందిన చంద్రశేఖర్‌ (35) పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎందుకంటే ప్రతి ఖరీఫ్‌ సీజన్‌లో చెల్లింపులకు కనీసం మూడునెలలపైనే పట్టేది. దీంతో ఏటా బాకీలకు అన్నదాతలు కలెక్టరేట్లను ముట్టడించే పరిస్థితి వచ్చేది.ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఖరీఫ్‌లో ఇప్పటి లాగే 10.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటే అందులో సగం కూడా కొనుగోలు చేసేదికాదు.దీంతో రైతులు ధాన్యంతో రోడ్డెక్కేవారు. మూడేళ్ల కిందట సంక్రాంతి పండగ సమయంలో ధాన్యంతో అమలాపురం కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. అటు ధాన్యం డబ్బుల్లో జాప్యం చేయడానికి రైతులు ఇచ్చిన ధాన్యం వివరాలను ఆర్‌బీకేల్లో నమోదు చేయకుండా రోజుల తరబడి జాప్యం చేసేది. తద్వారా బాకీలు తక్కువగా చూపించేది.

Updated Date - Dec 26 , 2025 | 12:38 AM