Share News

ఒడ్డున..పడుతున్నారు!

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:31 AM

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను మొంథా తుఫాన్‌ దెబ్బతీసింది. ప్రభుత్వం ఇటీవల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా తుఫాన్‌ వల్ల ఇబ్బంది ఏర్పడింది.

ఒడ్డున..పడుతున్నారు!

జిల్లాలో 212 కేంద్రాల ఏర్పాటు

5.31 లక్షల టన్నుల దిగుబడి

4 లక్షల టన్నులు సేకరణ

తుఫాన్‌ దెబ్బకు రైతుకు నష్టం

కొనుగోలు కేంద్రాలతో ఊరట

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను మొంథా తుఫాన్‌ దెబ్బతీసింది. ప్రభుత్వం ఇటీవల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా తుఫాన్‌ వల్ల ఇబ్బంది ఏర్పడింది.మంత్రి కందుల దుర్గేష్‌ ఇటీవల నిడదవోలు నుంచి జిల్లాలోని కొను గోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ తుఫాన్‌ వల్ల కొను గోలు ఆలస్యమైంది. జిల్లాలో చాలా పంట వాన నీటిలో మునిగిపోయింది. కొంత మేర రైతులు అయినకాడకు ధాన్యం అమ్మేసుకున్నారు. మిగి లిన ధాన్యం సోమవారం నుంచి ఫౌర సర ఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేయనుంది. రాజమహేంద్రవరం డివిజన్‌లో 93, కొవ్వూరు డివిజన్‌లో 119 మొత్తం జిల్లాలో 212 కేంద్రాలు ఏర్పాటు చేశారు.144 మిల్లుల ద్వారా కొనడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రూ.135 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీ కూడా లభించింది.

4 లక్షల టన్నుల సేకరణ

గతంలో కంటే ఎక్కువ ధాన్యం సేకరించ డా నికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా సాధారణంగా 2.5 మెట్రిక్‌ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకూ ధా న్యం సేకరించేవారు. దీంతో చివరలో రైతులు ఇబ్బందిపడేవారు. రబీ సీజన్‌లో రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రబీలో మంచి ధరకు కొనుగోలు చేయ డంతో పాటు 24 గంటల్లోనే నగదు కూడా రైతు ఖాతాల్లో జమచేయడంతో రైతు లు ప్రభుత్వానికే అమ్మాలనే ఆలోచనతో ముందుకొచ్చారు. దీంతో చివరి పంట రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం రైతుల నుంచి ఈ సీజన్‌లో ఎక్కువ ధాన్యం కొనుగోలుకు నిర్ణయించింది.జిల్లాలో మొత్తం 5.31 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుం దని వ్యవసాయశాఖ అంచనా. అందులో 4 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం సీఎంఆర్‌కు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు.

74,793 హెక్టార్లలో ఖరీఫ్‌..

జిల్లాలోని 18 మండలాల పరిధిలో 74, 793 హెక్టారల్లో ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకూ 9657.48 హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయి. డిసెంబరు 15వ తేదీ వరకూ కోతలు జరిగే అవకాశం ఉంది. కనీస మద్దతు ధర ప్రకారం కామన్‌ వెరైటీ క్వింటా ధాన్యానికి రూ. 2369, గ్రేడ్‌-ఎ రకానికి రూ.2389 ఇవ్వాల్సి ఉంది. కానీ రైతులు 17 శాతం తేమ వరకూ ధాన్యాన్ని ఆరబట్టవలసి ఉంది. గోనె సంచుల వినియోగచార్జీలు, కూలీల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. క్వింటాకు గోనె సంచుల వినియోగచార్జీ రూ.4.74, కూలీల చార్జీ రూ.22 వరకూ ప్రభుత్వం ఇస్తుంది. మద్దతు ధరతో ఈ చార్జీలకు సంబంధం లేదు. తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతాంగం మాత్రం తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తుఫాన్‌ నష్టం లెక్కింపు..

జిల్లాలో మొంథా తుఫాన్‌ నేపధ్యంలో నష్టపోయిన పంట లెక్కింపులో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 99.77 శాతం ఎన్యూమరేషన్‌ పూర్తయింది. జిల్లాలో 16, 843 మంది రైతులకు సంబంధించిన 25,444 చేలను అధికారులు సర్వే చేశారు. ప్యాడీ క్రాప్‌ డ్యామేజీ రిపోర్టు(పీసీడీఆర్‌) అందజేశా రు. అందులో ఇప్పటి వరకూ 8641.40 హెక్టార్లలో ఎన్యుమరేషన్‌ పూర్తిచేశారు. తాళ్లపూడి, గోపాల పురం, కడియం, రాజమండ్రి రూరల్‌, నల్లజర్ల, బిక్కవోలు మండలాల్లో పూర్తయింది. మిగిలినది పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - Nov 03 , 2025 | 12:31 AM