Share News

హోరాహోరీగా..

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:06 AM

మామిడికుదురు, నవంబరు 21 (ఆం ధ్రజ్యోతి): ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామి

హోరాహోరీగా..
గోగన్నమఠం వైనతేయ నదిలో వెళ్తున్న పడవలు

గోగన్నమఠంలో పడవ పోటీలు

ఉత్సాహంగా పాల్గొన్న మత్స్యకార యువకులు

మామిడికుదురు, నవంబరు 21 (ఆం ధ్రజ్యోతి): ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో నిర్వహించిన పడవ పోటీలు హోరాహోరీగా జరిగాయి. సుమారు 80కు పైగా పడవలు పాల్గొన్నాయి. అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ పోటీల్లో మత్స్యకార యువకులు, పెద్దలు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. గోగన్నమఠం రేవు నుంచి పాశర్లపూడిలంకలోని రెబ్బనపల్లి రేవు వరకు నాలుగు కిలోమీటర్లు మేర నిర్వహించిన ఈ పోటీలను తిలకించడానికి స్థానికులు భారీగా తరలివ చ్చారు. మొదటిస్థానంలో పెసంగి భైరవస్వామి (రూ.5వేలు), ద్వితీయస్థానంలో కాటాడి మీరాసాహెబ్‌(రూ.3వేలు), తృతీయ స్థానంలో కాటాడి సత్యనారాయణ (రూ.2వేలు) నిలిచి బహుమతులుగా గెలుచుకున్నారు. ఈ పోటీలను చింతా శ్రీనివాస్‌, అర్థాని శ్రీనివాస్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పట్టా నరసింహమూర్తి, జె.సత్యనారాయణ, పి.వెర్రియ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:06 AM