గట్టిగా పట్టు.. వలకట్లు పట్టు!
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:11 AM
కాట్రేనికోన, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మం డలం బలుసుతిప్పలో గోదావరిలో వలకట్ల అత్తరాల (స్థలాలు) కోసం గురువారం పడవ పోటీలు జరి గాయి. మత్స్యకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గోదావరికి వరదలు వచ్చినప్పటి నుంచి వరద తగ్గి ఉప్పునీరు వ
బలుసుతిప్పలో వలకట్ల అత్తరాల (స్థలాలు) కోసం పడవ పోటీలు
కాట్రేనికోన, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మం డలం బలుసుతిప్పలో గోదావరిలో వలకట్ల అత్తరాల (స్థలాలు) కోసం గురువారం పడవ పోటీలు జరి గాయి. మత్స్యకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గోదావరికి వరదలు వచ్చినప్పటి నుంచి వరద తగ్గి ఉప్పునీరు వచ్చే వరకు వేట నిలిపివేయడం మత్స్యకారుల కట్టుబాటు. ఉప్పునీరు వచ్చిన తర్వాత బలుసుతిప్ప నుంచి కోటిపల్లి వరకు గోదావరిలో వలకట్ల కోసం సుమారు 100 ఇంజన్ బోట్లతో మత్స్యకారులు పోటీల్లో పాల్గొంటారు. ఎవరైతే పడవ పోటీల్లో గోదావరిలో వలకట్ల స్థలం దక్కించుకుంటారో వారికి మళ్లీ వరదలు వచ్చే వరకు గోదావరిలో ఆ స్థలం కేటాయింపు చేస్తారు. గోదావరిలో ఏ ప్రాంతంలో చేపలు ఎక్కువగా పడతాయో స్థానిక మత్స్యకారులకు అవగాహన ఉంటుంది. గోదావరిలో పడవలో వెళ్లి ఆ ప్రా ంతాన్ని దక్కించుకుంటారు. ఏటా దీపావళి అనంతరం ఈ పోటీలు నిర్వహిస్తారు. దీంతో ప్రస్తుతం జరిగిన ఈ పడవ పోటీలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి.