Share News

పాపికొండలు యాత్ర బోట్ల నిలిపివేత

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:30 AM

దేవీపట్నం/ వీఆర్‌పురం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదికి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పోశమ్మ గండి బోట్‌ పా

పాపికొండలు యాత్ర బోట్ల నిలిపివేత
పోశమ్మ గండి బోట్‌ పాయింట్‌ వద్ద నిలిచిన పర్యాటక బోట్లు

దేవీపట్నం/ వీఆర్‌పురం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదికి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పోశమ్మ గండి బోట్‌ పాయింట్‌ నుంచి పాపికొండలు విహార యాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షంతోపాటు గోదావరి నీటిమట్టం పెరుగుతున్న కారణంగా ముందుస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో తదుపరి తేదీని వెల్లడిస్తామన్నారు. బుధవారం పాపికొండలు విహార యాత్రకు వెళ్లేందుకు ముందుగా టిక్కెట్లను రిజర్వేషన్‌ చేసుకున్నవారు వెనుతిరగక తప్పలేదు. పాపికొండలు పేరంటాలపల్లి విహారయాత్ర కూడా తాత్కాలికంగా ఆపేశారు.

Updated Date - Jul 03 , 2025 | 12:30 AM