Share News

పాపికొండలకు తరలివచ్చిన పర్యాటకులు

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:38 AM

దేవీపట్నం, జూన్‌ 8 (ఆం ధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పాపికొండల అందాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికులు తరలివచ్చారు. దేవీపట్నం మండల పరిధిలో పోశమ్మగండి బోటు పాయింట్‌ నుం చి గోదావరి ముంపు పరీవాహక ప్రాంతాలైన పూడిపల్లి, తొయ్యేరు, దేవీపట్నం, అగ్ర హారం, మూలపా

పాపికొండలకు తరలివచ్చిన పర్యాటకులు
పాపికొండలకు వెళ్తున్న పర్యాటక బోటు

దేవీపట్నం, జూన్‌ 8 (ఆం ధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పాపికొండల అందాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికులు తరలివచ్చారు. దేవీపట్నం మండల పరిధిలో పోశమ్మగండి బోటు పాయింట్‌ నుం చి గోదావరి ముంపు పరీవాహక ప్రాంతాలైన పూడిపల్లి, తొయ్యేరు, దేవీపట్నం, అగ్ర హారం, మూలపాడు, మడిపల్లి, మంటూరు, కచ్చులూరు, కె.గోందూరు, నడిపూడి తదితర గ్రామాల మీదుగా నాలుగు బోట్లలో 260మంది పాపికొండలకు వెళ్లారు. పేరంటాలపల్లిలో సందడి చేసి వెనుదిరిగారు. ముందుగా గండిపోశమ్మను దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తు లు పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి లోకి వెళ్లకుండా రేవుల వద్ద పోలీసులు గస్తీ ని ర్వహించారు. ప్రమాదాలు జరుగుతున్న దృ ష్ట్యా భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Jun 09 , 2025 | 12:38 AM