పేదరిక నిర్మూలనకే పీ4
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:11 AM
స్వచ్ఛంద సంస్థలు, పెద్దలు పీ4 కార్యక్రమంలో పాల్గొని పేదరిక నిర్మూలనలో భాగస్వాములై ప్రభుత్వానికి అండగా నిలవాలని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు పేర్కొన్నారు.
రాజానగరం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : స్వచ్ఛంద సంస్థలు, పెద్దలు పీ4 కార్యక్రమంలో పాల్గొని పేదరిక నిర్మూలనలో భాగస్వాములై ప్రభుత్వానికి అండగా నిలవాలని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు పేర్కొన్నారు. రాజానగరంలోని జీఎస్ ఎల్ మెడికల్ కళాశాలలో జీఎస్‌ఎల్ హెల్త్‌కేర్ అండ్ హెల్త్ ఎడ్యుకేషనల్ ఇన్సిస్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన పీ4 అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్‌షిప్ (పి4)కార్యక్రమాలు చేపట్టేవారికి ఎలాంటి జాప్యం లేకుండా సింగిల్ విండో విధానం తీసుకొచ్చే యోచన చేస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ సీఈవో సీహెచ్.నరేష్ కుమార్ మా ట్లాడుతూ పీ4లో భాగంగా చేపట్టిన సర్వేలో 20 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు పీ4లో చోటు దక్కలేదని, తిరిగి పీ4 సర్వే మరోసారి నిర్వహించాలని కోరారు. జీఎస్‌ఎల్ వైద్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ పీ4 కార్యక్రమ నిర్వ హణకు సాయం అందజేస్తున్నామన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రోటరీ ప్రెసిడెంట్ తీగల రాజా, తిరుమల చైర్మన్ నున్న తిరుమలరావు, జాస్తి మూర్తి, డాక్టర్ దివ్య, వి.రామనాఽథ్, వైస్ ప్రిన్సిపాల్ గోవిందరాజు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ,బ్రహ్మాజీ, వీరన్న చౌదరి పాల్గొన్నారు.