సొంతింటి కల సాకారానికి కూటమి చర్యలు
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:17 AM
పేద ల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూ టమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గృహ నిర్మాణశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్‌కుమార్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో 2019-2024 మధ్య కాలంలో మండలంలో అసంపూర్తిగా నిలిచి పోయి, ప్రధాన మంత్రి ఆవాస యోజన(పీఎం ఏవై) ఆసరాతో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారుల గృహా లను హౌసింగ్ అధికారులు బుధ వారం సందర్శించారు.

మే నెలాఖరుకు నిర్మాణ పనులను పూర్తి చేయాలి
హౌసింగ్ ఈఈ రాజ్‌కుమార్
రాజానగరం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పేద ల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూ టమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గృహ నిర్మాణశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్‌కుమార్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో 2019-2024 మధ్య కాలంలో మండలంలో అసంపూర్తిగా నిలిచి పోయి, ప్రధాన మంత్రి ఆవాస యోజన(పీఎం ఏవై) ఆసరాతో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారుల గృహా లను హౌసింగ్ అధికారులు బుధ వారం సందర్శించారు. ఈ సంద ర్భంగా ఈఈ రాజ్‌కుమార్ మాట్లా డుతూ పీఎంఏవై 2.0 పథకం కింద సొంత స్థలం ఉండి ఏడాదికి రూ.3 లక్షల ఆదాయ పరిమితి ఉన్న వారి కి గృహయోగం కల్పించాలని నిర్ణ యించిందన్నారు. రాజానగరం మం డల పరిధిలో నిర్మాణ పనులను పూర్తి చేయాల్సిన ఇళ్లు 721 ఉండగా వీటిలో ఎస్సీలు 321 మంది, ఎస్టీలు 7, బీసీలు 393 ఇళ్లు ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయంపై లబ్ధి దారులకు వివరిస్తున్నామన్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు అదనంగా రూ.50 వేలు మంజూరు కాగా, ఎస్టీలకు రూ.75 వేలు, గిరిజన ప్రాంతాల్లో రూ.లక్ష వంతున కూటమి ప్రభుత్వం మం జూరు చేస్తోందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు. మే నెలాఖరు నాటికి నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాపాక సుజాత తదిత రులు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభు త్వం అందించిన రూ.50 వేలతో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించుకున్నామంటూ, సీఎం చంద్ర బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం లో హౌసింగ్ డీఈ ఆర్.వెంకటేశ్వరబాబు, రాజా నగరం ఏఈ రామారావు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.