Share News

అతి వేగం.. అతి లోడు

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:52 AM

ఏజె న్సీ ప్రాంతాల నుంచి నిత్యం అనేక క్వారీ లారీ లు బండరాళ్లతో గోకవరం మీదుగా రాజమ హేంద్రవరం వైపు వెళ్తుంటాయి. వైసీపీ హ యాంలో అప్పటి నాయకులు వీటి రవాణా వ్య వహారాలు చూసుకునేవారనే ప్రచారం ఉంది. అప్పట్లోనే విచ్చలవిడిగా పరిమితికి మించిన బరువుతో క్వారీ లారీలు తిరుగుతుండేవి. వాటి కారణంగానే రోడ్లన్నీ గుంతలమయం అవుతు న్నాయని ప్రజల నుంచి అనేక విమర్శలు విని పించేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా రవాణా నిర్వహణ బాధ్యత మారి ఉండవచ్చే మో గానీ నిబంధనల ఉల్లంఘనల్లో తీరు మా త్రం మారలేదు. ప్రతీ అరగంటకో, గంటకో భారీ బండరాళ్లతో లారీలు అతి వేగంతో తిరుగుతూనే ఉన్నాయి.

అతి వేగం.. అతి లోడు
ఓవర్‌ లోడుతో వెళ్తున్న లారీ

  • ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా క్వారీ లారీల రాకపోకలు

  • బెంబేలెత్తిపోతున్న ప్రజలు

  • ఛిద్రమవుతున్న రహదారులు

ప్రధాన రహదారిపై నిబంధనలు మీరి పరుగులు తీస్తున్న వాహనాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా క్వారీ, గ్రావెల్‌ లారీలు వేగంగా వెళ్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. వాటిని కట్టడి చేయాల్సిన అధికారులు హెచ్చరికలకే పరిమితమవుతున్నారు. దీంతో పదేళ్ల పాటు ఉండాల్సిన రహదారులు ధ్వంసమైపోతున్నాయి.

గోకవరం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఏజె న్సీ ప్రాంతాల నుంచి నిత్యం అనేక క్వారీ లారీ లు బండరాళ్లతో గోకవరం మీదుగా రాజమ హేంద్రవరం వైపు వెళ్తుంటాయి. వైసీపీ హ యాంలో అప్పటి నాయకులు వీటి రవాణా వ్య వహారాలు చూసుకునేవారనే ప్రచారం ఉంది. అప్పట్లోనే విచ్చలవిడిగా పరిమితికి మించిన బరువుతో క్వారీ లారీలు తిరుగుతుండేవి. వాటి కారణంగానే రోడ్లన్నీ గుంతలమయం అవుతు న్నాయని ప్రజల నుంచి అనేక విమర్శలు విని పించేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా రవాణా నిర్వహణ బాధ్యత మారి ఉండవచ్చే మో గానీ నిబంధనల ఉల్లంఘనల్లో తీరు మా త్రం మారలేదు. ప్రతీ అరగంటకో, గంటకో భారీ బండరాళ్లతో లారీలు అతి వేగంతో తిరుగుతూనే ఉన్నాయి. వాటి వల్ల రహదారులు ఛిద్రమవుతు న్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 12 టైర్ల లారీకి 20టన్నుల వరకు, 10 టైర్ల లారీకి 16టన్నుల వరకు రా ళ్లు తరలించడానికి అనుమతులుంటాయి. డబ్బు ఆశతో వాహన దారులు పరిమితికి మించి క్వారీ రాళ్లను లోడ్‌ చేస్తున్నారు. 20 టన్నులు వేయాల్సిన టిప్పర్‌లో పరిమితికి మించి భారీగా నింపుతున్నారు. ఇంత బరువుతో వెళ్లే లారీలు రహదారిపై 30 నుంచి 40 కిలో మీటర్లు మించి వేగంతో వెళ్లరాదు, కానీ ఆ నిబంధ నలు వీరికి పని చేయవు. జనావాసాల మధ్య కూడా 50 కిలో మీటర్ల వేగం తగ్గకుండా నడు పుతున్నారు. సంత రోజులో కూడా అదే వేగంతో వాహనాలను నడపడం పరిపాటిగా మారింది.నిబంధనలను పాటించని క్వారీ వాహ నాలను అదుపు చేయడానికి రవాణా, పోలీస్‌, గనులు, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు సమన్వ యంతో పని చేయాల్సి ఉంది. కానీ అధికారలెవరూ ఆ దిశగా తనిఖీలు చేయరనేది బహిరంగ రహస్యం. క్వారీ లారీల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందోనని గోకవరం ప్రజలు హడలెత్తిపోతున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 12:52 AM