ఆపరేషన్ సిందూర్ దేశానికే గర్వకారణం
ABN , Publish Date - May 19 , 2025 | 12:43 AM
ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు ఒక సంకేతం పంపారని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు.
మలికిపురం, మే 18(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు ఒక సంకేతం పంపారని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఆదివారం మలికిపురంలో కూటమి ఆధ్వర్యంలో తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించారు. మలికిపురం వేంకటేశ్వరస్వామి గుడి వద్ద నుంచి మలికిపురం సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ పహల్గాం దాడి క్షమించరానిదన్నారు. పహల్గాంలో 26మంది మృతిచెందితే వారి ఆత్మలకు శాంతిగా ఆపరేషన్ సిందూర్ తగిన గుణపాఠం చెప్పిందన్నారు. భవిష్యత్‌లో ఉగ్రవాదులు ఎటువంటి సంఘటనలకైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈసందర్భంగా వీర జవాన్లకు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ వేమా, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, చిటికెన రామ్మోహనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మాలే శ్రీనివాసనగేష్, మండల టీడీపీ అధ్యక్షుడు అడబాల యుగంధర్, ముప్పర్తి నాని, చాగంటి స్వామి, గెడ్డం మహలక్ష్మిప్రసాద్, గుబ్బల ఫణికుమార్, ఎంపీపీ ఎంవీ సత్యవాణి, ఎంపీపీ కేతా శ్రీను, బోళ్ల వెంకటరమణ, దిరిశాల బాలాజీ, మంగెన భూదేవి, గుండుబోగుల పెదకాపు, అడబాల సాయిబాబు, చెల్లింగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.