ప్రత్యక్షంగా.. ప్రయోగాత్మకంగా..
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:16 AM
కాకినాడ క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ ఉత్సవాల్లో భాగ ంగా కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆధ్వ ర్యంలో విద్యార్థులకు శనివారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖకు
కాకినాడలో ఓపెన్ హౌస్ కార్యక్రమం
విద్యార్థులకు పలు అంశాలు వివరించిన ఎస్పీ బిందుమాధవ్
కాకినాడ క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ ఉత్సవాల్లో భాగ ంగా కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆధ్వ ర్యంలో విద్యార్థులకు శనివారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖకు సంబంధించిన సాంకేతికత పరికరాలు, కమ్యూనికేషన్, బాంబ్ టెక్షన్, డిస్పోజల్ సామగ్రి, వివిధ ఆయుధాలు, పోలీస్ జాగిలాల పని తీరు, డ్రోన్ల్ వినియోగం, వేలిముద్రల సేకరణ, బాడీ వార్న్ కెమెరాలు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సి స్టం, బ్రీత్ ఎనలైజర్స్, సిగ్నల్స్ స్పీడ్ గన్, నేర పరిశోధనలో, బాంబులను గుర్తించడంలో పోలీస్ జాగిలాల పని తీరు, బాంబ్ డిస్పోజల్ పరికరా లపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఎస్పీ ప్రత్యక్షంగా.. ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ నెల 27న కూడా ని ర్వహిస్తామని విద్యార్థులు, ప్రజలు వచ్చి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని తిలకించి అవగాహన పెంచుకోవాలని ఎస్పీ కోరా రు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్.శ్రీనివాసరావు, ఎస్‌బీ డీఎస్పీ కెవి సత్యనారాయణ, ఏఆర్ డీఎస్పీ వి.శ్రీహరి, సీఐలు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.