Share News

భక్తులకు విజ్ఞప్తి...

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:35 AM

అన్నవరం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాలు, దేవదాయశాఖ సూచనలతో కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ బుకింగ్‌, దర్శనాలు, వసతి, ప్రసాదం ప్యాకెట్ల కొనుగోలు తదితర అంశాలపై విస్తృత ప్రచారం చేపట్టా రు. దేవదాయశాఖలో కేవలం 2శాతం

భక్తులకు విజ్ఞప్తి...
అన్నవరం ఆలయ ప్రాంగణంలో సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్న అధికారులు

అన్నవరం దేవస్థానంలో సేవలు, వ్రతాల

టిక్కెట్ల ఆన్‌లైన్‌ విధానంపై విస్తృత ప్రచారం

ముఖ్య ప్రదేశాల్లో సైన్‌బోర్డులు

ప్రజలకు తగ్గనున్న నిరీక్షణ

అన్నవరం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాలు, దేవదాయశాఖ సూచనలతో కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ బుకింగ్‌, దర్శనాలు, వసతి, ప్రసాదం ప్యాకెట్ల కొనుగోలు తదితర అంశాలపై విస్తృత ప్రచారం చేపట్టా రు. దేవదాయశాఖలో కేవలం 2శాతం మంది మా త్రమే ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకుంటున్నారని సర్వేలో తేలడంతో అధికశాతం భక్తుల దర్శనాలు, ప్రసాదాల కొనుగోలు వద్ద, వసతి కేటాయింపు సమయంలో అధికసమ యం నిరీక్షణ చేస్తుండడంతో అంతా ఆన్‌లైన్‌ విధానం తీసుకువచ్చారు. దీనిని విస్తృతంగా భక్తుల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయా దేవస్థానాలకు అప్పగించింది. దీంతో అన్నవరం ఆ లయ ప్రాంగణంలో ముఖ్యప్రదేశాలు, ఇతర ప్రాంతాలతో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం తో పాటుగా ఉద్యోగులు తమ ఫోన్లలో స్టేటస్‌లలో పెడుతున్నారు. భక్తులు ఆన్‌లైన్‌ విధానం సద్వినియోగం చేసుకుంటే నిరీక్షణ సమయం చాలా తగ్గుతుందని అధికారులు తెలిపారు.

అంతర్వేదిలో కూడా..

అంతర్వేది, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖ ఆదేశాల మేరకు కమిషనర్‌ సూచనలు అనుసరించి డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనసింహస్వామి ఆలయంలో దేవస్థానానికి సంబంధించి వసతి గదులు, దర్శనాలు, అభిషేకం, సుదర్శన హోమం, ఇతర సేవల బుకింగ్‌లు, ప్రసాదం టోకెన్ల విక్రయాలు ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌ ద్వారా వివిధ సేవలు, దర్శనాల టిక్కెట్లను బుక్‌ చేసుకునే విధానంలో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఏపీటెంపుల్స్‌. ఏపీ. జీవోవీ.ఇన్‌ ద్వారా ఆలయంలో జరిగే సేవలను ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చని ఆలయ ఏసీ ఎంకేటీఎన్వీ ప్రసాద్‌ తెలిపారు. అన్నదాన, గోసంరక్షణ వంటి పథకానికి విరాళాలు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్‌ యూపీఐ ద్వారా చెల్లించవచ్చని చెప్పారు.

Updated Date - Dec 03 , 2025 | 12:35 AM