Share News

ఒంగోలు ఆవు రికార్డు

ABN , Publish Date - May 07 , 2025 | 12:25 AM

మండపేట, మే 6(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట పాడి రైతు వేగుళ్ల మురళీకృష్ణకు చెందిన ఒం గోలు జాతి ఆవు పాలు ఇవ్వడంతో రికార్డు నెలకొల్పింది. సాధారణంగా ఒంగోలు జాతి ఆవు పూటకు రెండున్నలీటర్ల నుంచి మూడు లీటర్లు ఇస్తుంది. రోజుకు 5లేదా 6లీటర్లు ఇవ్వటం పరి

ఒంగోలు ఆవు రికార్డు
రికార్డు స్థాయిలో పాలు ఇచ్చిన ఆవు

ఒక్కరోజులో 21.19 లీటర్ల పాలు

మండపేట, మే 6(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట పాడి రైతు వేగుళ్ల మురళీకృష్ణకు చెందిన ఒం గోలు జాతి ఆవు పాలు ఇవ్వడంతో రికార్డు నెలకొల్పింది. సాధారణంగా ఒంగోలు జాతి ఆవు పూటకు రెండున్నలీటర్ల నుంచి మూడు లీటర్లు ఇస్తుంది. రోజుకు 5లేదా 6లీటర్లు ఇవ్వటం పరిపాటి. అలాంటిది మురళీకృష్ణకు చెందిన 5ఏళ్ల ఆవు మంగళవారం ఉదయం 11.5 లీటర్లు, సాయంత్రం 9.6 లీటర్లు కలిపి ఒక్కరోజులో 21.19 లీటర్ల పాలు ఇచ్చి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. కేంద్రియ పశు నమోదు అధికారి డి.రాజేశ్వ రరావు సమక్షంలో మురళీకృష్ణ పాలు తీయ గా పాలు వివరాలను నమోదు చేసి కేంద్రి య పశు నమోదు సెంటర్‌కు పంపించారు.

Updated Date - May 07 , 2025 | 12:25 AM