Share News

ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:25 AM

యానాం/ఐ.పోలవరం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): యానాం, కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం భైరవపాలెం వద్ద సరిహద్దు ప్రాంతం వద్ద సముద్రం నుంచి గోదావరి మీదుగా వెళ్లే ఓఎన్‌ జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌ అవ్వడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఆకాశం ఎరు పెక్కింది. సుమారు 40అడుగుల మేర మంట లు ఎగిసిపడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటలకు జరిగిన ఈ సం

ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌
గ్యాస్‌ లీకై వస్తున్న మంటలు

40 అడుగుల మేర ఎగిసిపడిన మంటలు

ఆహుతైన మడ అడవులు

యానాం/ఐ.పోలవరం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): యానాం, కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం భైరవపాలెం వద్ద సరిహద్దు ప్రాంతం వద్ద సముద్రం నుంచి గోదావరి మీదుగా వెళ్లే ఓఎన్‌ జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌ అవ్వడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఆకాశం ఎరు పెక్కింది. సుమారు 40అడుగుల మేర మంట లు ఎగిసిపడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటలకు జరిగిన ఈ సంఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. స్థానికులు పు దుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో హుటహుటిన ఓఎన్‌జీసీ, యానాం పరిపాలనాధికారి, పోలీసులతో మాట్లాడి సంఘటన ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. ఓఎన్‌జీసీకి చెందిన సేఫ్టీ అధికారులు పైప్‌లైన్‌ నుంచి వచ్చే గ్యాస్‌ను సముద్రంలోనే వాల్‌ ముసివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే చుమురు సంస్థల అధి కారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలని మ ల్లాడి అన్నారు. సంఘటనా ప్రాంతం సమీపంలోని మడ అడవులు అగ్నికి ఆహుతయ్యయి. మంటలు ఐలాండ్‌-3 పైప్‌ నుంచి ఐలాండ్‌-2 పైప్‌లైన్‌కు వ్యాపించడంతో సుమారు 3 కిలోమీటర్ల మేర చెట్లు, మొక్కలు కాలి బూడిదయ్యాయి. అయితే ప్ర మాదం ఏ విధంగా జరిగిందే అనేది చమురుసంస్థలకు చెందిన అధికారులే తేల్చాసి ఉంది. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్‌, గూటం శివగణేష్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఆర్ధాని దీనేష్‌, మెల్లం శ్రీనివాస్‌ బృందం సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. అర్ధాని దినేష్‌ మాట్లాడుతూ అధికారుల నిర్లక్షంతోనే ఈ సంఘటన జరిగిందన్నారు. గత సెప్టెంబరు 21న పైప్‌లైన్‌ లీక్‌ అయినప్పుడే చర్యలు తీసుకోవాలని కోరితే తూతూమంత్రంగా రక్షణ చ ర్యలు చేపట్టారని, అందువల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని ఇప్పటికైనా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌ అవ్వడం వల్ల చేపలు చనిపోతున్నాయని భైరవపాలెం, గాడిమొగ మత్స్యకారులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు విన్నవించారు.

Updated Date - Aug 23 , 2025 | 12:25 AM