Share News

హైదరాబాద్‌లో హత్య.. గోదావరిలో మృతదేహం లభ్యం

ABN , Publish Date - Dec 31 , 2025 | 01:23 AM

మామిడికుదురు/పెరవలి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో హత్యకు గురైన వృద్ధురాలి మృతదేహం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికు

హైదరాబాద్‌లో హత్య.. గోదావరిలో మృతదేహం లభ్యం
వృద్ధురాలి మృతదేహం

పెదపట్నం మధ్యలంకలో గుర్తించిన పోలీసులు

పోస్టుమార్టం నిర్వహించిన రాజోలు వైద్యులు

మామిడికుదురు/పెరవలి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో హత్యకు గురైన వృద్ధురాలి మృతదేహం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పె దపట్నం మధ్యలంకలో మంగళవారం లభ్య మైంది. నాచారం సీఐ ధనుంజయ్‌ తెలిపిన వివ రాల ప్రకారం.. ఈనెల 19న హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ బాబానగర్‌ ప్రాంతానికి చెందిన సురెడ్డి సుజాత (65) హత్యకు గురైనట్టు నాచా రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుజాత ఇంట్లో అద్దెకు ఉండే తూ ర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు ఇంట్లో పనులు చేస్తు ఆమె ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేశాడు. అదును చూసి ఆమె వంట గదిలో పనులు చేస్తుండగా వెనుక నుంచి దుప్పటితో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశా డు. సుజాత మృ తదేహాన్ని అంజి బాబు తన స్నేహితులు పెర వలి మండలం ఖండవల్లికి చెందిన ఎన్‌.యువరాజు, అమ లాపురానికి చెందిన దుర్గారా వుతో కలిసి ఈనెల 20న అద్దెకారులో కోనసీమ జిల్లాకు తీసుకువచ్చి గోదావరిలో పడవేశారు. సుజాత కనిపించకపోవడంతో ఈనెల 24న ఆమె బంధువులు ఫిర్యాదు చేయగా నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. అనుమానం కలిగి అంజిబాబును అదు పులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో ముగ్గురి నిందితుల్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ ధనుంజయ్‌ తెలిపారు. మంగళవారం పెదప ట్నం మధ్యలంకలో సుజాత మృతదేహం లభ్య మైంది. మృతదేహం పూర్తిగా పాడవడంతో అక్కడే రాజోలు వైద్యులతో పోస్టుమార్టం నిర్వ హించి అనంతరం బంధువులకు అప్పగించారు.

Updated Date - Dec 31 , 2025 | 01:23 AM