Share News

కన్నేసి.. కాటేసి!

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:37 AM

దారుణం.. అమానుషం.. మాటల్లో చెప్పలేని ఘోరం.. మాయమాటలు చెప్పి అభం శుభం ఎరుగని బాలికపై అత్యాచారం.. తాతయ్య వరుసయ్యే దగ్గరి బంధువే అఘాయిత్యానికి ఒడిగట్టిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది..

కన్నేసి.. కాటేసి!
నారాయణరావును పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం

తునిలో బాలికపై ఘోరం

తాతయ్య వరసయ్యే వృద్ధుడు కాటేసిన వైనం

ఆస్పత్రి పేరుతో బాలికను పాఠశాల నుంచి తీసుకువెళ్లిన నిందితుడు

తొండంగిలో ఓ తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం: ఆనక స్కూల్లో దించేసి ఇంటికి..

వీడియో వైరల్‌ అవడంతో విషయం తెలిసి నిందితుడిని చితకబాదిన బంధువులు

బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాచారంగా నిర్ధారణ

నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలింపు: పోక్సో, అత్యాచారం, కిడ్నాప్‌ కేసుల నమోదు

దారుణం.. అమానుషం.. మాటల్లో చెప్పలేని ఘోరం.. మాయమాటలు చెప్పి అభం శుభం ఎరుగని బాలికపై అత్యాచారం.. తాతయ్య వరుసయ్యే దగ్గరి బంధువే అఘాయిత్యానికి ఒడిగట్టిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది..

(కాకినాడ/తునిరూరల్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి):

కాకినాడ జిల్లా తుని పట్టణ శివారులో ఓ గురుకుల పాఠశాలలో ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. కొంత కాలం కిందట బాలిక తండ్రి మరణించాడు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఆమెను చదువు మానిపించేయాలని అను కున్నా, ఆ పని చేయలేక తల్లి గురుకుల పాఠశాలలో చేర్చిం ది. వీరికి దగ్గరి బంధువైన తుని పట్టణంలో రెండో వార్డుకు చెందిన తాటిక నారాయణరావు(62) బాలికపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల యాజమాన్యాన్ని తాను బాలిక తాతయ్యగా నమ్మించాడు. అనేకసార్లు పాఠశా లకు వచ్చి బాలికను ఆస్పత్రికి చూపించాలంటూ స్కూల్‌ నుంచి తీసుకువెళ్లేవాడు. తాతయ్య కావడంతో పాఠశాల సిబ్బందికి కూ డా అనుమానం రాలేదు. ఎప్పటిలా అతడు మంగళవారం ఉదయం 11 గంటలకు స్కూలుకు వచ్చి బాలి కను బయటకు తీసుకువెళ్లాడు. అనంతరం ఆమెకు తిను బండా రాలు కొనిచ్చాడు. తనంటే ఇష్టం ఏర్పడేలా చేసుకున్నాడు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు తొండంగి మండలం పైడికొండ గ్రామ శివార్లలోని సపోటా తోట లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయ డంతో అక్కడే ఉన్న ఓ రైతు గమనించి అక్కడికి వచ్చాడు. నువ్వెవరు.. స్కూలు పిల్లను తోటలోకి తీసుకువచ్చి ఏం చేస్తున్నావంటూ నిలదీశాడు. అత్యాచారం చేసిన సదరు నిందితుడు రైతుపై ఎదురుతిరిగాడు. దీంతో రైతు మరింత ఆగ్రహంతో స్కూలు అమ్మాయిని తోటలోకి తీసుకువచ్చి బట్టలు విప్పి ఏం చేస్తున్నావు.. అంటూ గద్దించాడు. దీంతో నిందితుడు మరింత ఎదురుతిరిగి నేను మున్సిపాల్టీ కౌన్సిల ర్‌ను అంటూ గట్టిగా మాట్లాడాడు. బాలికను ఇదే తోటలోకి అనేకసార్లు తీసుకువచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ రైతు మళ్లీ నిలదీయడంతో.. నేను పాడు చేశానా.. అమ్మాయి బాత్‌రూంకి అంటే తీసుకువచ్చా అంటూ బుకాయించాడు. బట్టలు విప్పి ఏంచేస్తున్నావు అని గద్దించి పోలీసులకు ఫోన్‌ చేస్తా అని రైతు మరింత నిలదీయడంతో తాతయ్యను అవు తాను.. బాత్‌రూంకు తీసుకువచ్చాను అంటూ సమాధానం ఇ చ్చాడు. తర్వాత గుట్టుగా బాలికను గురుకుల పాఠశాలలో దించేసి ఏం ఎరుగనట్లు తునిలో తన ఇంటికి వెళ్లిపోయాడు.

వైరల్‌ అవడంతో..

తోటలో బాలికతో సదరు నిందిడుతు ఉన్న వీడియోలను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవికాస్తా క్షణాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో విషయం బాలిక కుటుం బీకులు, బంధువులకు తెలిసింది. దీంతో వారంతా సదరు నిం దితుడి ఇంటికి వెళ్లి నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో వారంతా సదరు నిందితుడికి మంగళవారం రాత్రి దేహశుద్ధి చేసి తుని రూరల్‌ పోలీసులకు అప్పగిం చారు. ఆ తర్వాత బుధవారం ఉదయం గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. బాలికను పదేపదే నిందితుడితో ఎలా పంపిస్తారనే దానిపై గురుకుల పాఠశాల సిబ్బందిని నిలదీశారు. కాసేపటికి పోలీసులు రావడంతో వారిని కూడా నిలదీశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సాయంత్రం బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. దీంతో నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు తుని రూరల్‌ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు తుని రూరల్‌ స్టేషన్‌లో క్రైం నెంబర్‌ 250/2025 కింద యూ/ఎస్‌ 137 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ప్రిన్సిపాల్‌ వివరణ..

ఈ ఘటనపై గురుకుల పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నాగజ్యోతి మాట్లాడుతూ తాను పాఠశాలలో కొత్తగా విధుల్లో చేరడం వల్ల ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఉపాధ్యాయుల ధ్రువీకరణ మేరకు బాలిక బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

దుష్ప్రచారంపై హెచ్చరిక..

కాగా నిందితుడు కూటమి పార్టీకి చెందిన వ్యక్తిగా చిత్రీకరించేందుకు వైసీపీ ప్రయత్నం చేయడం వివాదాస్పదంగా మా రింది. దీంతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు గురుకుల పాఠశాల వద్ద మీడియాతో మాట్లాడారు. నిందితుడు నారా యణరావుకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. నారాయణరావుపై పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. కిడ్నాప్‌, అత్యాచారం కింద వచ్చే వివిధ కఠినమైన సెక్షన్‌లు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు. అ యితే బాలిక వీడియోను కొందరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారని, ఇది కూడా పోక్సో కేసులోకి వస్తుందని డీఎస్పీ తెలిపారు. అత్యాచార ఘటనపై ఎంపీ సానా సతీష్‌బాబు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ఖండించి నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:37 AM