Share News

పిల్లలైన.. పెద్దలు!

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:25 AM

స్నేహబంధం చాలా మధుర మైనది.. ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లయినా చెరిగిపోదు.. చెదిరిపోదు..

పిల్లలైన.. పెద్దలు!
కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 56 ఏళ్ల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థినులు

రాజమహేంద్రవరం కల్చరల్‌,డిసెంబర్‌ 11(ఆంధ్రజ్యోతి): స్నేహబంధం చాలా మధుర మైనది.. ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లయినా చెరిగిపోదు.. చెదిరిపోదు.. ఈ సంఘటనే దానికి ఉదాహరణ.. ఎప్పుడో 56 ఏళ్ల కిందట డిగ్రీ చదువుకున్నారు.. అంతా ఎక్కడెక్కడో సెటిలై పోయారు.. మనవళ్లు.. మనవరాళ్లతో ఉన్నారు.. అయితేనేం వాళ్ల స్నేహితులను మాత్రం మర్చిపోలేదు. కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం పూర్వ విద్యార్థినుల సంఘం ఆధ్వర్యంలో 1968-69 బ్యాచ్‌ డిగ్రీ విద్యార్థినులు కలు సు కున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సందడి చేశారు. అంతా పిల్లలుగా మారి పోయారు..ఆ నాటి స్మృతులను తలచుకుంటూ మురిసిపోయారు. ఎలా ఉండేవాళ్ల ఎలా అయిపోయామే అనుకుంటూ సంతోషంగా గడిపారు. రాజీవ్‌గాంధీ ప్రిన్సిపాల్‌ ఎన్‌.మేరీజోన్స్‌ రోసెట్‌, ప్రిన్సిపాల్‌ పిరాఘవకుమారి, పూర్వ విద్యార్థినుల సంఘం అధ్యక్షురాలు ఎం.సాయిభాగ్యలక్ష్మి,వి.ఉషాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 12:25 AM