పనులు త్వరగా పూర్తి చేయండి
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:25 AM
మోతుగూడెం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్‌లో బుధవారం విజ యవాడ విద్యుత్ సౌదా హైడల్ డైరెక్టర్, ఇన్ చార్జ్ డైరెక్టర్ ఫైనాన్స్ సృజయ్ కుమార్ పర్యటించారు. కాంప్లెక్స్‌లోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రాన్ని సం దర్శించారు. ఏపీ జెన్కో ప్రతి ష్టాత్మకంగా నిర్మి
ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్‌ను సందర్శించిన విద్యుత్ సౌదా హైడల్ డైరెక్టర్
మోతుగూడెం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్‌లో బుధవారం విజ యవాడ విద్యుత్ సౌదా హైడల్ డైరెక్టర్, ఇన్ చార్జ్ డైరెక్టర్ ఫైనాన్స్ సృజయ్ కుమార్ పర్యటించారు. కాంప్లెక్స్‌లోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రాన్ని సం దర్శించారు. ఏపీ జెన్కో ప్రతి ష్టాత్మకంగా నిర్మిస్తున్న 230మెగావాట్ల 5,6 యూనిట్ల జల విద్యుత్ కేంద్రం పనులను పరిశీలించారు. 5,6 యూ నిట్ల పనులకు సంబంధించి ఓవల్ ఆ ఫీస్ బటర్ల్పై వాల్ నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. అలాగే 5, 6 యూనిట్ల పెన్‌స్టాక్ పైప్లైన్ పనులను పరిశీలించారు. సివి ల్ పనుల ప్లాంట్ మేనేజర్ భీమవరపు బాలకృష్ణని అడి గి తెలుసుకున్నారు. 5,6 యూనిట్లకు సంబంధిం చి సివిల్, మెకానికల్ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయన్నారు. సాధ్య మైనంత త్వరగా 5,6 యూనిట్ల పనులను పూర్తి చేస్తే ఇప్పుడున్న 460 మెగావాట్ల విద్యుత్తు ఉత్ప త్తికి తోడు మరో 230 మెగావాట్లు తోడై మొత్తంగా 690 మెగా వాట్ల ఉత్పత్తి ఈ జల విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తవుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎత్తి పోతల పనులకు సంబంధించి అప్పర్ సీలేరు జలవిద్యుత్ కేంద్రానికి బయలుదేరారు. కార్యక్రమంలో విజయవాడ హైడల్ సివిల్ సీఈ పి.రవీందర్‌రెడ్డి, టీయూఎన్ శ్రీనివాస్, ఎస్సీ హైడల్ ఎం.విజయవాడ సివిల్ హైడల్ ఎస్సీ శ్రీనివాసరెడ్డి, సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ వెంకట రాజారావు, ఎస్సీ చిన్నకామేశ్వర రావు, టెక్నికల్ డీఈ వరప్రసాద్, సివిల్ ఎస్సీ చం ద్ర శేఖర్ రెడ్డి, సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగ శ్రీ నివాస్, సీనియర్ ఎకౌంటు ఆఫీసర్ వర ప్రసాద్ సివిల్, ఏడీఈలు కొండబాబు, నరసింహులు అసిస్టెంట్ ఇంజనీర్లు పవన్‌విజయ్ ఉన్నారు.