Share News

రెవెన్యూ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీల్లో కోనసీమ కలెక్టరేట్‌ జట్టు విన్నర్‌

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:13 AM

అమలాపురం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రెవెన్యూ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీల్లో కలెక్టరేట్‌ జట్టు విన్నర్‌గాను, అమలాపురం రెవెన్యూ డివిజన్‌ బృందం జట్టు రన్నర్‌గాను నిలిచినట్టు కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ఎన్‌ రాజకు

రెవెన్యూ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీల్లో కోనసీమ కలెక్టరేట్‌ జట్టు విన్నర్‌
విజేతగా నిలిచిన కలెక్టరేట్‌ బృందానికి షీల్డు అందజేసిన కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

అమలాపురం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రెవెన్యూ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీల్లో కలెక్టరేట్‌ జట్టు విన్నర్‌గాను, అమలాపురం రెవెన్యూ డివిజన్‌ బృందం జట్టు రన్నర్‌గాను నిలిచినట్టు కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్‌ఎన్‌ రాజకుమారి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి కడలి కాశీవిశ్వేశ్వరరావుల పర్యవేక్షణలో జిల్లా రెవెన్యూ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించినట్టు తెలిపారు. విన్నర్స్‌, రన్నర్స్‌గా నిలిచిన జట్లకు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి షీల్డులు అందజేశారు. క్రీడా పోటీలకు వ్యాఖ్యాతగా ఎస్పీ భరత్‌ వ్యవహరించారు. రెవెన్యూ ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో క్రికెట్‌ పోటీల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. విధి నిర్వహణలో మానసిక ఒత్తిడిని అధిగమించి మానసిక ఉల్లాసాన్ని పొందేందుకు క్రీడలు దోహదపడతాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ బృందానికి కెప్టెన్‌గా కిశోర్‌, అమలాపురం డివిజన్‌ జట్టుకు కెప్టెన్‌గా శివ వ్యవహరించారు. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా కిరణ్‌, బెస్ట్‌ బౌలర్‌గా కృపాపాల్‌ నిలిచారు. విన్నర్స్‌ బృందంలో కిరణ్‌, శేషు, సుధీర్‌కుమార్‌, రన్నర్స్‌ జట్టులో శివ, యాకుబ్‌, కల్యాణ్‌లు అద్భుత ప్రతిభ చాటారు.

Updated Date - Mar 25 , 2025 | 12:13 AM