Share News

ఆక్రమించెయ్‌..కలిపెయ్‌..

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:10 AM

వర్షాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ పనులు ఊ పందుకున్నాయి. వర్షాభావ ప్రాంతాల్లో వ్యవసా యం చేసే రైతులకు కాలువల నీరే ఆధారం. అయితే రియాల్టర్ల దందాతో కాలువలు ఎక్కడిక క్కడ ఆక్రమణకు గురవుతున్నాయి. సాగునీరు పారే కాలువలు మూతబడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆక్రమించెయ్‌..కలిపెయ్‌..
గోకవరంలో బురద కాలువపై చేపట్టిన నిర్మాణం

  • ఆక్రమణలకు గురవుతున్న కాలువలు

  • సాగు నీరెళ్లే దారి లేక రైతుల గగ్గోలు

  • నిత్యకృత్యమైన రియల్టర్ల దందా!

  • పత్తాలేని ఇరిగేషన్‌ అధికారులు

గోకవరం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): వర్షాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ పనులు ఊ పందుకున్నాయి. వర్షాభావ ప్రాంతాల్లో వ్యవసా యం చేసే రైతులకు కాలువల నీరే ఆధారం. అయితే రియాల్టర్ల దందాతో కాలువలు ఎక్కడిక క్కడ ఆక్రమణకు గురవుతున్నాయి. సాగునీరు పారే కాలువలు మూతబడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

గోకవరం మండలంలోని పలు ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న స్థలాలకు డిమాండు పెరిగింది. ఇదే అదునుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ కార్యకలాపాలను విస్తరింపజేసుకుంటున్నారు. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న కాలువలకు అనధికారికంగా తూ ములు, సిమ్మెంట్‌ శ్లాబ్‌ వేసేస్తున్నారు. గోకవరం శివారున శివాలయం సమీపంలో కళింగలు మీదుగా తంటికొండ పొలాలకు వెళ్లే కాలువ చా లావరకు మూతబడిపోయింది. రియల్లర్లు కాలు వను ఆక్రమించుకొని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నా రు. దీంతో కాలువ ప్రవాహం దిశ మా ర్చుకొని రోడ్లు, పొలాల పైనుంచి ప్రవ హిస్తోంది. ఈ అక్రమణల వల్ల సుమా రు 50 ఎకరాల పంట పొలాలు నీట ము నిగే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ జరుగుతున్న ఆక్ర మణలపై తాము ముందే సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవ డం లేదని ఆవేదన చెందుతుంది. గోకవరం -కొత్తపల్లి రోడ్డులో కూడా కాలువలు ఆక్రమ ణలకు గురయ్యాయి. ఈ కాలువలపై చేపట్టిన నిర్మాణాలు నీటి ప్రవాహనికి సరిపోకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలి చిపోయి రాత్రుళ్లు దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని స్థానికులు గగ్గోలు పెడు తున్నారు. ఈ విధంగా మండలంలోని చాలా ప్రాంతాల్లో ఆక్రమణలు చోటు చేసుకోవడంపై అధికారులకు ఫిర్యాదులు అందినా అవి బుట్టదాఖలే అవుతున్నాయి.

  • ఆక్రమణలు వైసీపీ హయాంలోవే..

గోకవరంలో కాలు వల ఆక్రమణలు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినవేనని పలువురు బహిరంగంగానే విమర్శి స్తున్నారు. అప్పట్లో నీటిపారుదల శాఖలోని ఉన్నత, స్థానిక అధికారులను రియల్టర్లు మచ్చిక చేసుకొని తద్వారా కాలువలను ఆక్రమించుకొని వాటిపై ఇష్టానుసారంగా నిర్మాణాలు జరిపారు. కొందరైతే అనుమతులు లేకుండానే కాలువలపై శాశ్వత నిర్మాణాలు చేశారు. రానున్న వర్షాకా లంలో ఈ అక్రమ కట్టడాల వల్ల పరిశర ప్రాం తాల్లో ఉన్న పంట పొలాలు నీట మునిగే ప్రమాదం ఉంది.

  • జాడ లేని ఇరిగేషన్‌ అధికారులు..

మండలంలోని కాలువలు ఆక్రమణలకు గురవుతున్నా ఇరిగేషన్‌ అధికారుల జాడే లేదు. అసలు ఈ ప్రాంతానికి ఇరిగేషన్‌ అధికారి ఉన్నారో లేరో అనే సందేహం రైతుల్లో నెలకొంది. ఆక్రమణలపై ఫిర్యాదు చే యాలంటే రాజమహేంద్రవరం వెళ్లా ల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాల సీజన్‌. ఆపై పంటల కాలం. అండగా ఉం డాల్సిన ఇరిగేషన్‌ అధికారుల జాడ కానరాకపోవడం తమను కలవరపా టుకు గురి చేస్తుందని అన్నదాతలు వాపోతున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 01:10 AM