Share News

ఎన్‌వోసీలు ఆపండి!

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:45 AM

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాఖలైన మైనింగ్‌ దరఖాస్తులకు స్కెచ్‌లు విక్రయించి భారీగా వెన కేసుకున్న వ్యవహారంలో గలీజు సర్వేయర్‌కు ఉ చ్చు బిగుస్తోంది. ఒకరికి తెలియకుండా మరొ కరికి మైనింగ్‌ స్కెచ్‌లు విక్రయించడం, అటు భారీ మొత్తాల్లో డబ్బులు గుంజేసి స్కెచ్‌లు ఒకే వ్యాపారికి అందేలా చేసి అడ్డగోలు లబ్ది చేకూర్చిన సదరు సర్వేయర్‌ తీరుపై విచారణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు ఈ అక్రమా

ఎన్‌వోసీలు ఆపండి!

‘పక్కాగా స్కెచ్‌’పై ఆంధ్రజ్యోతి కథనం ఎఫెక్ట్‌

మైనింగ్‌ దరఖాస్తుదారులెవరికీ ఎన్‌వోసీలు ఇవ్వొద్దు

ఉమ్మడి జిల్లాలో మైనింగ్‌ దరఖాస్తు దారులకు

స్కెచ్‌ల విక్రయ బాగోతంపై కలెక్టర్ల ఆరా

ఏడీ, ఇన్‌చార్జి డీడీని పిలిపించి తెరవెనుక వ్యవహారంపై నిలదీత

అటు ఎవరెవరు ఎంత ముడుపులు ఇచ్చారో

ఆరా తీయించిన కాకినాడ కలెక్టర్‌

సర్వేయర్‌కు స్కెచ్‌ల కోసం డబ్బులు ఇచ్చింది

నిజమేనని దరఖాస్తుదారుల అంగీకారం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాఖలైన

53 దరఖాస్తులను రప్పించి స్కెచ్‌ల పరిశీలన

అటు అక్రమాలకు పాల్పడిన సర్వేయర్‌ను పిలిపించి హెచ్చరించిన వైనం

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాఖలైన మైనింగ్‌ దరఖాస్తులకు స్కెచ్‌లు విక్రయించి భారీగా వెన కేసుకున్న వ్యవహారంలో గలీజు సర్వేయర్‌కు ఉ చ్చు బిగుస్తోంది. ఒకరికి తెలియకుండా మరొ కరికి మైనింగ్‌ స్కెచ్‌లు విక్రయించడం, అటు భారీ మొత్తాల్లో డబ్బులు గుంజేసి స్కెచ్‌లు ఒకే వ్యాపారికి అందేలా చేసి అడ్డగోలు లబ్ది చేకూర్చిన సదరు సర్వేయర్‌ తీరుపై విచారణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు ఈ అక్రమాల బాగోతంపై దృష్టిసారించారు. రాజమహేంద్రవ రం గనులశాఖ ఏడీ, కాకినాడ గనులశాఖ ఇన్‌ చార్జి డీడీగా వ్యవహరిస్తున్న ఫణిభూషన్‌ రెడ్డిని వీరిద్దరు పిలిపించి విచారించారు. దరఖాస్తుల దాఖలుకు తప్పనిసరిగా అవసరమైన స్కెచ్‌ల విక్రయం వెనుక అసలు ఏం జరిగిందనే దానిపై ఆంధ్రజ్యోతిలో శనివారం వచ్చిన కథనంపై ఆరా తీశారు. దరఖాస్తుదారులకు స్కెచ్‌లు విక్రయుం చిన ఘటనలో సర్వేయర్‌ పాత్ర ఏస్థాయిలో ఉం ది.. మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో తొలి వరు సలో ఎవరు ఉన్నారు? దరఖాస్తుదారుల దాఖలు చేసి న స్కెచ్‌లకు ఎంతెంత వసూలు చేశారు? వంటి అంశాలపై ఇద్దరు కలెక్టర్లు విచారించారు. అటు దాఖలైన మొత్తం 53 దరఖాస్తుల్లో 42 వరకు కాకినాడ జిల్లా రౌతులపూడిలో క్వారీల మైనింగ్‌ కోసమే రావడంతో ఈ వ్యవహారంపై కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సీరియస్‌ గా ఉన్నారు. మొత్తం దాఖలైన దరఖాస్తులన్నీ ంటిని రప్పించారు. ఆయా మైనింగ్‌ స్కెచ్‌లను పరిశీలించారు. ఎవరెవరు ఎంతెంత విస్తీర్ణానికి మైనింగ్‌ స్కెచ్‌లు జతచేశారో లోతుగా పరిశీలిం చారు. ఒక్కొక్క స్కెచ్‌కు సదరు సర్వేయర్‌ ఎంత వసూలు చేశారు? అనేదానిపై కొందరు ఆర్‌ఐల ద్వారా దరఖాస్తుదారులకు ఫోన్లు చేయించి విచా రణ చేయించారు. ఈక్రమంలో తాము సర్వేయర్‌ కు స్కెచ్‌ కోసం ఎంతెంత ముట్టజెప్పిందీ కూలం కుషంగా వారంతా వివరించారు. ఈ నేపథ్యంలో స్కెచ్‌ల పేరుతో డబ్బులు వసూళ్లు జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించారు. ఈ నేపథ్యం లో మైనింగ్‌ లీజుల మంజూరులో అత్యంత కీలక మైన ఎన్‌వోసీల జారీని తక్షణం నిలిపివేయాలని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి తహశీల్దార్లను కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ఆదేశించా రు. ఈ అక్రమాల బాగోతం తేలే వరకు ఏ వ్యా పారికీ నిరభ్యంతర పత్రాలు జారీ చేయకూడదని వారికి స్పష్టంచేశారు. అటు దాఖలైన దరఖాస్తు లను సైతం లీజుల మంజూరుకు వీలుగా స్ర్కూ టినీ చేయకుండా దరఖాస్తులను సీజ్‌ చేశారు. అలాగే లీజుల కోసం వచ్చిన దరఖాస్తుదారుల్లో ఇతర ప్రాంతాల వ్యాపారులు ఉన్నారా? భారీ మైనింగ్‌ విస్తీర్ణం కోసం ఎవరెవరు అప్లికేషన్లు వేశారనేది విచారించారు. ఇదిలాఉంటే అక్రమా లకు పాల్పడి స్కెచ్‌ల విక్రయించిన సర్వేయర్‌ను కాకినాడ జిల్లా కలెక్టర్‌ మంగళవారం పిలిపించా రు. స్కెచ్‌ల విక్రయంతో భారీగా వెనకేసుకోవ డం, సర్వేయర్‌కు డబ్బులు ఇచ్చిన మాట వాస్త వమేనని దరఖాస్తుదారులు ఇప్పటికే విచారణలో వెల్లడించిన విషయాన్ని ఆయన ఎదుట ప్ర స్తావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా వ్యవహరించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెగేసి చెప్పారు. మరోపక్క పక్కాగా స్కెచ్‌ వేసి మైనింగ్‌ దర ఖాస్తుదారుల నుంచి లక్షల్లో డబ్బులు గుంజేసి రూ.కోటి వరకు డబ్బులు గుంజేసిన గలీజు సర్వేయర్‌పై ఆంధ్ర జ్యోతిలో శనివారం, ఆదివారం వచ్చిన కథనాలపై ఇంటిలిజెన్స్‌ ఆరా తీసింది. సదరు సర్వేయర్‌ ఎవరెవరి నుంచి ఎంత వసూలు చేసింది వివ రాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపింది.

Updated Date - Jul 09 , 2025 | 01:45 AM